GSLV_F08 ప్రయోగం విజయవంతం

GSLV_F08 ప్రయోగం విజయవంతం
x
Highlights

మొబైల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించే దిశగా ఇస్రో మరో ముందడు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-08 రాకెట్ ద్వారా ఓ ప్రత్యేక...

మొబైల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించే దిశగా ఇస్రో మరో ముందడు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-08 రాకెట్ ద్వారా ఓ ప్రత్యేక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన GSLV F-08 రాకెట్ ద్వారా జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని రోదశిలోకి విజయవంతంగా పంపారు. మొబైల్ కమ్యునికేషన్ రంగం కోసం రూపొందించిన జీశాట్ సిరీస్ ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు సేవలు పొందుతున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా 2015 ఆగస్టు 27వ తేదీన జీఎస్ఎల్వీ డి6 రాకెట్ ద్వారా జీశాట్ 6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహ కాలపరిమితి తొమ్మిదేళ్లు. అయితే దాని సేవలు అంతకు ముందే ముగిసే అవకాశం ఉన్నట్లు భావించిన శాస్ర్తవేత్తలు.. జీశాట్ 6ఏని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో ఎస్ బాండ్, సి బాండ్ ట్రాన్స్ఖపాండర్స్ ఎక్కువగా ఉండడంతో కమ్యునికేషన్ వ్యవస్ధ మరింత మెరుగయ్యే అవకాశం ఉందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

2140 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని 3 దశల్లో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం తన సేవలను అందించనుంది. దేశ రక్షణ రంగానికి కూడా ఈ ఉపగ్రహ సేవలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దేశ సరిహద్దుల్లో 20 కిలోమీటర్ల దూరంలో కదలికలను గుర్తించే సామర్ధ్యం దీని సొంతం.

Show Full Article
Print Article
Next Story
More Stories