పెళ్లయిన మరునాడే మృత్యు ఒడిలోకి..!

పెళ్లయిన మరునాడే మృత్యు ఒడిలోకి..!
x
Highlights

పెళ్లి పీఠలు ఎక్కి ఒక్కరోజు కూడా కాకముందే అప్పుడే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. పెళ్లి బాజాభజంత్రీల మోతతో సందడిగా ఉన్న ఇంట్లో విషాధఛాయలు అలుముకున్నాయి....

పెళ్లి పీఠలు ఎక్కి ఒక్కరోజు కూడా కాకముందే అప్పుడే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. పెళ్లి బాజాభజంత్రీల మోతతో సందడిగా ఉన్న ఇంట్లో విషాధఛాయలు అలుముకున్నాయి. పెళ్లి చేసుకున్న తెల్లవారుజామునే గుండెపోటు రూపంలో మృత్యువు కాటేసింది. ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోకి ఎన్‌వీఆర్ వీధికి చెందిన మోహీన్‌బాషా(28) బెంగళూరులో స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ఆదివారం పెళ్లి అయింది. అయితే అర్థరాత్రి 12గంటలకు బంధువులతో ఆట,పాటలతో సందడిగా గడిపారు. అనంతరం ఇంటికి వచ్చారు. ఉదయం 9గంటల సమయంలో మోహీన్‌బాషాకు ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. దింతో హుటాహుటినా కుటుంబ సభ్యులు దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరిలించారు అయితే అప్పటికే మోహీన్ చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. దొంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories