ఉన్నావ్ రేప్ కేసు... బీజేపీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన సీఎం యోగి...

ఉన్నావ్ రేప్ కేసు... బీజేపీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన సీఎం యోగి...
x
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్...

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కుల్దీప్‌ సెంగార్‌కు కొనసాగుతున్న ‘వై’ కేటగిరీ భద్రతను తొలగించింది. ఉన్నావ్ జిల్లా బంగర్మావ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఇప్పటిదాకా ఇద్దరు కమెండోలు, పోలీసులు సహా మొత్తం 11 మందితో ‘వై’ కేటగిరీ భద్రత కల్పించారు. ఎమ్మెల్యే కుల్దీప్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారిస్తున్న‌ది. యూపీ పోలీసులు ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని మరోవైపు బాధితురాలు ఆరోపించారు. బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మృతిచెందడం మరింత వివాదానికి కారణమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories