ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య కీలక చర్చలు.. నిర్ణయాలు ఇవే..

ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య కీలక చర్చలు.. నిర్ణయాలు ఇవే..
x
Highlights

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య తాత్కాలిక సంధి కుదిరినట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య నెలకొని ఉన్న విభేదాల నేపథ్యంలో...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య తాత్కాలిక సంధి కుదిరినట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య నెలకొని ఉన్న విభేదాల నేపథ్యంలో బోర్డు సమావేశం కీలకంగా మారింది. మింట్‌ రోడ్‌లోని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయలంలో దాదాపు 9 గంటలపాటుగా సాగిన ఈ సమావేశంలో సంధి దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు రుణ నిబంధనలు, బలహీన బ్యాంకులకు ఉండాల్సిన నిబంధనలు తదితర అంశాలపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, డిప్యూటీ గవర్నర్లు.. ప్రభుత్వ నామినీలైన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ల నుంచి ప్రశ్నలు వచ్చినట్లు సమాచారం.

అలాగే 25 కోట్ల వరకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాల పునర్నిర్మాణానికి వీలు కల్పించే ఒక పథకాన్ని ఆర్‌బీఐ పరిశీలించనుంది. సీఆర్‌ఏఆర్‌ను 9% వద్దే ఉంచాలని బోర్డు నిర్ణయించింది. సమావేశానంతరం ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం తొమ్మిదిన్నర లక్షల కోట్ల అదనపు మూలధనం అంశం పరిశీలనకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు బోర్డు అంగీకరించింది. ఈ కమిటీ ఆర్‌బీఐ వద్ద ఉండాల్సిన మూలధన నిధుల నిల్వల సంఖ్యను నిర్ణయిస్తుంది. మొత్తానికి బోర్డు సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది. ఇక తదుపరి సమావేశం వచ్చే డిసెంబరు 14న జరిగే అవకాశముంది.


Show Full Article
Print Article
Next Story
More Stories