గూగుల్‌ షాపింగ్‌ వచ్చేసింది

గూగుల్‌ షాపింగ్‌ వచ్చేసింది
x
Highlights

ఇప్పటికే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి విక్రయ సంస్థలు ఆన్‌లైన్‌ వ్యాపారంలో దూసుకుపోతున్నాయి. వీటికి పోటీగా కొన్ని సంస్థలు ఉన్నా వీటిని...

ఇప్పటికే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి విక్రయ సంస్థలు ఆన్‌లైన్‌ వ్యాపారంలో దూసుకుపోతున్నాయి. వీటికి పోటీగా కొన్ని సంస్థలు ఉన్నా వీటిని అధిగమించలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఈ దిగ్గజ సంస్థలను ధీటుగా ఎదుర్కొనేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. ‘గూగుల్‌ షాపింగ్‌’ పేరుతో కొత్త షాపింగ్‌ ప్లాట్‌ఫాంను నేడు(డిసెంబరు 13) లాంచ్‌​ చేసింది..ఈ షాపింగ్‌ పోర్టల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, పుస్తకాలు సహా వివిధ విభాగాలకు చెందిన ఉత్పత్తులను విక్రయిస్తుంది. వందలాదిమంది తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఇదొక గొప్ప అవకాశమని గూగుల్ షాపింగ్ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురోజిత్ చటర్జీ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. త్వరలోనే మొబైల్ వినియోగదారుల కోసం ప్రోగ్రెసివ్‌ వెబ్‌యాప్‌ను లాంచ్‌ చేస్తామని ఆయన చెప్పారు. ఇంగ్లీష్‌తోపాటు హిందీ భాషలోలో ధరలు, బెస్ట్‌డీల్స్‌ తదితర సమాచారాన్నితెలుసుకునే వీలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. కాగా ‘గూగుల్‌ షాపింగ్‌’ ప్రారంభించి కొన్ని గంటలు కూడా గడవకముందే వినియోగదారులు ఆఫర్ల కోసం విపరీతంగా శోధించడం మొదలుపెట్టారు. దాంతో ఇతర సంస్థలకు కొంతమేర ఆదరణ తగ్గిందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories