రెచ్చిపోయిన ప్రేమోన్మాది… ఒంటికి నిప్పంటించుకొని యువతి ఇంట్లోకి

రెచ్చిపోయిన ప్రేమోన్మాది… ఒంటికి నిప్పంటించుకొని యువతి ఇంట్లోకి
x
Highlights

హైదరాబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. యువతి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఏకంగా అమ్మాయి ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని...

హైదరాబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. యువతి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఏకంగా అమ్మాయి ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ఇంట్లో ఉన్న యువతి కుటుంబసభ్యులకు ఆ నిప్పంటుకుని తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే ఈ దారుణానికి పాల్పడింది ఇబ్రహీం అనే పెళ్ళైన వ్యక్తి అని తెలుస్తోంది. అతనికి ఇదివరకే ఇద్దరు సంతానం. గతకొంత కాలంగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటూ బార్కస్ లో నివసించే ఓ యువతి వెంటపడుతున్నాడు. .ఈ విషయం సదరు యువతి కుటుంబసభ్యులకు తెలిసి అతడిని మందలించారు. పెళ్లికి నిరారించడంతో పాటు పోలీస్‌ స్టేషన్‌లో అతగాడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇబ్రహీం ఈ దురాగతానికి పాల్పడ్డాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories