చుండ్రును ఇలా వదిలించుకోండి.. బట్టతల బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి..

Highlights

ఏ కాలంలో అయినా స‌హ‌జంగా చాలా మందికి చుండ్రు స‌మ‌స్య ఉంటుంది. అయితే అది చలికాలంలో మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.. ఈ చుండ్రు వలన జుట్టు రాలటం ఎక్కువగా...

ఏ కాలంలో అయినా స‌హ‌జంగా చాలా మందికి చుండ్రు స‌మ‌స్య ఉంటుంది. అయితే అది చలికాలంలో మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.. ఈ చుండ్రు వలన జుట్టు రాలటం ఎక్కువగా ఉంటుంది.. చుండ్రు నివారణకు అంద‌రూ ర‌క‌ర‌కాల టిప్స్ పాటిస్తూ ఈ మహమ్మారిని వ‌దిలించుకునేందుకు రకరకాల ఆయుర్వేద వైద్య పద్ధతులు వాడుతుంటారు. ఈ క్రమంలోనే మన చేతుల్లోనే చుండ్రును నివారించే రకరకాల పద్ధతులు ఎలాగో తెలుసుకోండి..

1. అరకప్పు పెరుగులో 5 టీస్పూన్ల నిమ్మరసం కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3 రోజులు చేయాలి.

2. కలబంద ఆకు నుంచి తాజా జెల్‌ను తీసుకొని తలకు రాసుకోవాలి. ఆరగంట తర్వాత మెడికేటెడ్ షాంపూతో తలస్నానం చేస్తే చాలు. చుండ్రు పోతుంది.

3. కొన్ని వేప ఆకులు రుబ్బి, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడ‌గాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

4. వేడి నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల చుండ్రును అరికట్టవచ్చు. రాత్రి పడుకునే ముందు ఏదైనా హెయిర్ ఆయిల్‌ను వేడి చేసి జుట్టుకు పట్టించాలి. ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

ఇలా వారానికి 2 సార్లు చెయ్యడం వల్ల చుండ్రును పూర్తిగా నివారించవచ్చని కేశ సంరక్షణ నిపుణులు అంటున్నారు.. ఒకవేళ గనక మనం ఈ చుండ్రును నిర్లక్ష్యం చేసినట్టయితే మన జుట్టు రోజురోజుకు కుదుళ్ళతో సహా రాలిపోయేప్రమాదం ఉంది..

Show Full Article
Print Article
Next Story
More Stories