హిజ్రాలకు మద్దతిచ్చిన గంభీర్

హిజ్రాలకు మద్దతిచ్చిన గంభీర్
x
Highlights

ఇండియన్ యంగ్ క్రికెటర్స్‌లో గౌతమ్ గంభీర్ రూటే సెపరేటు. ఎవరెన్నీ అనుకున్న తనకు నచ్చిందే చేస్తాడు. టీమిండియాలో లేకపోయిన.. భారతీయ మనసుల్లో మాత్రం తన...

ఇండియన్ యంగ్ క్రికెటర్స్‌లో గౌతమ్ గంభీర్ రూటే సెపరేటు. ఎవరెన్నీ అనుకున్న తనకు నచ్చిందే చేస్తాడు. టీమిండియాలో లేకపోయిన.. భారతీయ మనసుల్లో మాత్రం తన గొప్ప పనులతో గంభీర్ చెరగని ముద్ర వేసుకున్నాడు. భారత సైనికులకు, అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేయడంలో ముందున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ గంభీర్. సమాజంలో హిజ్రాలపై ఉన్న చిన్న చూపుని చెరిపేసేందుకు గంభీర్ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు నాందిగా ఈ ఏడాది రక్ష బంధన్ రోజున అతను హిజ్రాలతో రాఖీలు కట్టించుకొని ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. తాజాగా గంభీర్ మ‌ద్దతు ప‌లుకుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు. ఢిల్లీలో హిజ్రాల‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో అత‌ను బొట్టు పెట్టుకుని హిజ్రాలు వేసుకునే దుస్తులు ధ‌రించాడు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో షెమారి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన 'హిజ్రా హబ్బా' ఏడవ సంచిక కార్యక్రమానికి గౌతమ్ గంభీర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ గంభీర్‌ దుపట్టా, బొట్టును ధరించి ట్రాన్స్‌ జెండర్లకు తన మద్దతును తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. తన స్థాయిని పక్కన పెట్టి హిజ్రాల కోసం ఇలాంటి పని చేసిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ.. సోషల్‌మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు.
Image result for Gautam Gambhir

Image result for gautam gambhir rakhi

Show Full Article
Print Article
Next Story
More Stories