థ‌టీజ్ సీఎం చంద్ర‌బాబు

థ‌టీజ్ సీఎం చంద్ర‌బాబు
x
Highlights

రాష్ట్రానికి సీఎం చంద్ర‌బాబు చేస్తున్న కృషిని వెల‌క‌ట్టలేం. అభివృద్ధి చేస్తే చేశాడు. లేదంటే చేయ‌లేదు అనడం ఉత్తమం. అభివృద్ధి చేసినా చేయ‌కపోయినా...

రాష్ట్రానికి సీఎం చంద్ర‌బాబు చేస్తున్న కృషిని వెల‌క‌ట్టలేం. అభివృద్ధి చేస్తే చేశాడు. లేదంటే చేయ‌లేదు అనడం ఉత్తమం. అభివృద్ధి చేసినా చేయ‌కపోయినా చేస్తున్న ప్ర‌తీ అభివృద్ధిలో నెగిటీవ్ ను ఆలోచిస్తే ..మ‌న కార్య‌చ‌ర‌ణ‌కూడా మ‌న‌కు వ్య‌తిరేకంగా మారుతుంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే చంద్ర‌బాబు రాష్ట్ర‌కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. విదేశాల‌నుంచి పెట్టుబ‌డులు తెచ్చేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప‌నితీరును మెచ్చిన కొరియాకు చెందిన వాహ‌న త‌యారీ సంస్థ కియో మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లో త‌న సంస్థ‌ను స్థాపించేందుకు మొగ్గుచూపింది. అందులో భాగంగా ఆ సంస్థ ప్ర‌తినిధులు చంద్ర‌బాబును సంప్ర‌దించ‌గా కియో మోటర్స్ కు అనంతపురం జిల్లా పెనగొండ మండలం, ఎర్రమంచి, గుడిపల్లిలో, 587.84 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పగించింది.
ప్రతిష్ఠాత్మక కియో కార్ల పరిశ్రమను తమ వద్ద నెలకోల్పేలా పలు రాష్ట్రాలు తీవ్రంగా యత్నించాయి. అయితే సంస్థ ఏపీలో పరిశ్రమ నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చిన సంగతి తెలిసిందే. ఏటా 3లక్షల కార్లు తయారీ సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం 1.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కాగా 2019 ద్వితీయార్దానికల్లా ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అనంత‌పురం జిల్లాలో ఈనెల 22న జ‌ర‌గ‌బోయే ఫ్రేమ్ వర్క్స్ పనుల ప్రారంభోత్సవానికి సీఎంని సాదరంగా ఆహ్వానించారు. ఇదే విష‌యాన్ని వెల్లడిస్తూ చంద్ర‌బాబు ఓ ట్వీట్ కూడా చేశారు. నిజానికి, ఈ సంస్థ ఏపీకు రావ‌డం చంద్ర‌బాబు పాల‌న‌నే చెప్పుకోవ‌చ్చు.
తొల‌త త‌మిళ‌నాడులో స్థాపించాల‌ని ప్ర‌య‌త్నం చేసినా చివ‌రి నిమిషంలో వెన‌క్కిత‌గ్గింది. వ్యాపార‌భివృద్ధికి ఏ ప్రాంత్రంలో సంస్థ‌ను నెల‌కొల్పితే బాగుంటుంద‌న్న విష‌యాల‌పై లోతుగా విశ్లేషిస్తే ఏపీయే అనువైన ప్రాంతంగా కియో ప్ర‌తినిధులు గుర్తించారు. త‌మిళ‌నాడు ను కాద‌ని ఏపీ లో స్థాపించ‌డంపై రాజ‌కీయ నేత‌ల హ‌స్తం ఉన్న‌ట్లు తెలుస్తోంది. సంస్థ స్థాప‌న‌కు ఇచ్చే అనుమ‌తుల‌క‌లంటే వారు అడిగే లంచాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ కియో ప్ర‌తినిధులు వాపోయారు.
ఈ సంస్థ ఏర్పాటు చేయాల‌నుకున్న‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా వారు ఒక అధ్య‌యం చేశార‌ట‌. వాటిలో త‌మిళ‌నాడు, గుజ‌రాత్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లు ఉన్నాయి. త‌మిళ‌నాడు లో లంచం అడ‌గడంతో వెన‌క్కిత‌గ్గింది. అయితే, రెండోదిగా ఉన్న గుజ‌రాత్ ను కాద‌ని, ఆంధ్రాకు రావ‌డం వెన‌క చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం ఉంద‌నే చెప్పుకోవాలి. ఏపీలో కంపెనీల‌ను స్థాపిస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఏపీ సీఈవోగా గుర్తింపు ఉన్న చంద్ర‌బాబు ప్రొజెక్ట‌ర్ వేసి మ‌రీ చూయించారు. దీంతో ఫిదా అయినా కియో ఏపీకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories