‘‘అ! సినిమాకు కత్తిమహేష్ రివ్యూ

‘‘అ! సినిమాకు కత్తిమహేష్ రివ్యూ
x
Highlights

క్రిటిక్ కత్తిమహేష్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన " ఆ " సినిమాపై రివ్యూ ఇచ్చాడు. కథను నమ్ముకున్న నాని ధైర్యం చేసి ఈ సినిమాను తెరకెక్కించడం...


క్రిటిక్ కత్తిమహేష్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన " ఆ " సినిమాపై రివ్యూ ఇచ్చాడు. కథను నమ్ముకున్న నాని ధైర్యం చేసి ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం . ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండడంతో సినిమాపై అంచనాలు భారీ గా పెరిగాయి. కొత్త డైరక్టర్ ప్రశాంత్ వర్మ సహా కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషారెబ్బా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, మురళీశర్మ నటించడం సహా నాని, రవితేజల వాయిస్ ఓవర్ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
అయితే ఇవ్వాళ విడుదలైన ‘‘అ! క్రిటిక్ కత్తిమహేష్ తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో మూస ధోరణికి బ్రేక్ పడేలా ఉందంటూ ఆకాశానికి ఎత్తాడు. బ్రిలియంట్ కథనంతో డైరక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానం బాగుందని అన్నాడు. ఈ సినిమాను అద్భుతంగా రావడానికి ప్రతి ఒక్క టెక్నీషియన్ ది బెస్ట్గా ప్రయత్నించారు. ఇలాంటి కొత్తదనంతో కూడిన సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకు నాని స్పెషల్ అభినందనలకు అర్హుడు’’ అని మహేష్ పేర్కొన్నారు.
అంతే కాదు ఈ సినిమాలో క‌ష్ట‌మైన పాత్ర గురించి ప్రాస్త‌వించిన క‌త్తి ..ఈ సినిమాలో ఈ క్యారెక్టర్స్‌లో కష్టతరమైన పాత్ర ప్రియదర్శిదేనని దానికి గల కారణాలను విశ్లేషించారు. ‘‘అ!’ మూవీ సగం వరకూ యాక్షన్‌తో కాకుండా రియాక్షన్‌తోనే భావాలను పలికించారు. ఈ సినిమాలో చాలా కష్టతరమైన పాత్ర అంటే ప్రియదర్శిదే. ఎందుకంటే అతను రెండు కల్పిత పాత్రలు ఎవరైతే చేపకు నాని.. చెట్టుకు రవితేజ వాయిస్ ఇచ్చారో.. ఆ రెండు పాత్రల మధ్య ప్రియదర్శి నటించాడు.’’ అని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories