పదవికి రాజీనామా విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్న ఫేస్‌బుక్‌ ఛైర్మన్

పదవికి రాజీనామా విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్న ఫేస్‌బుక్‌ ఛైర్మన్
x
Highlights

ఫేస్‌బుక్‌ ఛైర్మన్ పదవికి తాను రాజీనామా చేయనని ఆ సంస్థ వ్యవస్థాపక సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌...

ఫేస్‌బుక్‌ ఛైర్మన్ పదవికి తాను రాజీనామా చేయనని ఆ సంస్థ వ్యవస్థాపక సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెరిల్‌ శాండ్‌బర్గ్‌ కూడా రాజీనామా చెయ్యదని జుకెర్ బర్గ్ వెల్లడించారు. ఫేస్‌బుక్‌కు షెరిల్‌ ఎంతో కీలకమైన వ్యక్తి. ఎన్నో సమస్యలను ఆమె మోస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేస్తున్నారుఅని జుకర్‌బర్గ్‌ అన్నారు. గత దశాబ్దకాలంగా ఆమెతో కలిసి తాను పనిచేస్తున్నాం, ఇంకా కొన్ని దశాబ్దాలపాటు మేమిద్దరం కలిసే పనిచేస్తామని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. కాగా డేటా అనలిటికా కుంభకోణం, డేటా లీకేజీ, రిపబ్లికన్ పార్టీతో సంబంధమున్న సంస్థతో ఎన్నికల్లో డీల్ కుదర్చుకోవడం తదితర పరిణామాలు ఫేస్‌బుక్‌ ను కుదిపేస్తున్నాయి. దాంతో పెట్టుబడిదారులు జుకర్‌బర్గ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. బోర్డు ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని జుకర్‌బర్గ్‌ను డిమాండ్ చేశారు. ఐతే, బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోవడానికి ఇది సరైన సమయం కాదని జుకర్‌బర్గ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories