ఫేస్ బుక్ మెసెంజర్ లో సరికొత్త ఫీచర్..

ఫేస్ బుక్ మెసెంజర్ లో సరికొత్త ఫీచర్..
x
Highlights

సోషల్ మీడియా చాటింగ్ దిగ్గజం పేస్ బుక్ మెసెంజర్ తన వినియోగదారులకు మరో నూతన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఆడియో మరియు వీడియో చాటింగ్...

సోషల్ మీడియా చాటింగ్ దిగ్గజం పేస్ బుక్ మెసెంజర్ తన వినియోగదారులకు మరో నూతన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఆడియో మరియు వీడియో చాటింగ్ అందుబాటులో ఉండగా తాజాగా మెసెంజర్ లో వాయిస్ సౌలబ్యాన్ని కూడా యాడ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా యూజర్లు మాట్లాడితే అది టెక్స్ట్ మెసేజ్ గా మారుతుంది. దీంతో చాటింగ్ సులువు అవుతుంది. అంతే కాకుండా ఈ ఫీచర్ ఉపయోగించి యూజర్లు తమ ఫ్రెండ్ లో ఎవరికైనా మెసెంజర్ ద్వారా వాయిస్ కాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఈ ఫీచర్ ను ప్రయోగిస్తున్నారని ప్రముఖ టెక్ వెబ్ సైట్ టెక్ క్రంచ్ తెలిపింది. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని.. దీంతో డ్రైవింగ్ చేస్తూ కూడా మెసేజ్ లకు జవాబు ఇవ్వొచ్చని పేర్కొంది. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్నవారికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అన్ని స్థానిక భాషల్లో టైప్ ఈ సౌకర్యం ఉంటుందని.. టెక్ క్రంచ్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories