కుదేల‌వుతున్న ఫేస్ బుక్

కుదేల‌వుతున్న ఫేస్ బుక్
x
Highlights

కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిన ప్రముఖ సోషల్‌ మీడియా వేదిక ఫేస్‌బుక్‌కు ఇతర దిగ్గజ కంపెనీలు కాకపుట్టిస్తున్నాయి. ఈ...

కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిన ప్రముఖ సోషల్‌ మీడియా వేదిక ఫేస్‌బుక్‌కు ఇతర దిగ్గజ కంపెనీలు కాకపుట్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అసంతప్తిగా ఉన్న ఖాతాదారులు ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించాలని పిలుపునిస్తున్నారు. అదే విధంగా పలు కార్పొరేట్‌ కంపెనీలు ఎఫ్‌బి ఖాతాలను డిలీట్‌ చేస్తున్నాయి. తాజాగా మొజిల్లా, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ ఎఫ్‌బికి గుడ్‌బై చెప్పాయి. ముఖ్యంగా లక్షలాది ఫాలోవర్లు ఉన్న టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీల ఫేస్‌బుక్‌ అకౌంట్లను తొలగించినట్టు ఎలన్‌ మస్క్‌ ప్రకటించడం కలకలం రేపింది. ఫేస్‌బుక్‌ అనేది ఒకటుందనేది తనకు తెలియందంటూ వ్యంగ్యస్థ్రాలు సందించారు. తాను గానీ, తన కంపెనీలుగానీ ఫేక్‌ ఎండార్స్‌లు చేయవన్నారు. సోషల్‌ మీడియా వేదికల్లో ఇన్‌స్ట్రాగ్రామ్‌ పర్వాలేదన్నారు.

ఇక ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ కూడా తాము ఫేస్‌బుక్‌ నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అయితే మొజిల్లా తన ఖాతాను తొలగించనప్పటికీ, ఇకపై ఈ ఖాతా నుంచి ఎలాంటి పోస్టులు చేయబోమని వెల్లడించింది. ఇప్పటికే వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్‌ ఆక్టన్‌ కూడా ‘ఇది ఫేస్‌బుక్‌ను డిలీట్‌ చేయాల్సిన సమయమని అన్నారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు 5కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఓ యాప్‌ ద్వారా సేకరించారు. దీన్ని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జూకర్‌బర్గ్‌ కూడా అంగీకరించారు. తప్పు చేసినట్టు ఒప్పుకున్నారు. మీ డేటాను రక్షించే బాధ్యత తమదని, ఒకవేళ తాము అలా చేయలేకపోతే, మీకు సేవ చేసే అర్హత కలిగి ఉండమని తెలిపారు. ఇప్పుడు జరిగింది మరోసారి జరగదని హామీ ఇచ్చారు. ఆయన విశ్వాసం కోల్పోయిన ఖాతాదారులు ఎఫ్‌బిని వీడుతున్నారు.

ఫేస్‌బుక్‌ లీక్‌ వ్యవహారం ఆ కంపెనీ మార్కెట్‌ విలువను అమాంతం కోల్పోయేలా చేసింది. దీంతో వారం వ్యవధిలోనే ఫేస్‌బుక్‌ స్టాక్స్‌ 14 శాతం దిగజారి 160 డాలర్లకు పడిపోయింది. దీంతో ఒక్క వారంలోనే ఫేస్‌బుక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా 75 బిలియన్‌ డాలర్ల మేర దిగజారింది. జుకర్‌బర్గ్‌ రెండు నెలల్లో 10.3 బిలియన్‌ డాలర్లు నష్టపోయారని మరో రిపోర్టు పేర్కొంది. దీంతో బ్లూమ్‌బర్గ్‌ బిలీనియర్స్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో జుకర్‌బర్గ్‌ 3 స్థానాలు కిందకి పడిపోయి, 7వ స్థానంలోకి వచ్చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories