జగన్ ను పరామర్శించిన మాజీ సీఎం : ఇది దుర్మార్గపు చర్య : మోహన్ బాబు

జగన్ ను పరామర్శించిన మాజీ సీఎం : ఇది దుర్మార్గపు చర్య : మోహన్ బాబు
x
Highlights

జగన్‌పై దాడిని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు ఖండించారు. సిటీ న్యూరో ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. జగన్‌కు అందుతున్న చికిత్స వివరాలను, ఆరోగ్యంపై...

జగన్‌పై దాడిని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు ఖండించారు. సిటీ న్యూరో ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. జగన్‌కు అందుతున్న చికిత్స వివరాలను, ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జగన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన కోలుకోడానికి వారం రోజులు పట్టవచ్చని తెలిపారు. మరోవైపు జగన్ పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు సినీ నటుడు మోహన్ బాబు.. తెలుగు ప్రజల ఆశిస్సుల వల్లే.. జగన్‌ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని.. మోహన్‌బాబు చెప్పారు. రాజకీయాల్లో పోటీ మనస్థత్వం ఉండాలి కానీ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణులు సరికావన్నారు. జగన్‌పై దాడి ఘటన కలలో కూడా ఊహించరానిదని.. ఇది దుర్మార్గపు చర్య అని మోహన్‌బాబు అన్నారు. కాగా జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఇది పిరికిపందల చర్యగా అయన అభివర్ణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories