ఇప్పుడున్న ATM కార్డులిక మూడు నెలలే.. ఆ తరువాత ఏం చేయాలంటే..

ఇప్పుడున్న ATM కార్డులిక మూడు నెలలే.. ఆ తరువాత ఏం చేయాలంటే..
x
Highlights

ప్రస్తుతం ఉన్న ఎటిఎం కార్డులు ఇక మూడు నెలలు మాత్రమే పని చేసే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 31 లోపు ఎటిఎం వినియోగదారులు కొత్త ఏటీఎంలకు అప్లై...

ప్రస్తుతం ఉన్న ఎటిఎం కార్డులు ఇక మూడు నెలలు మాత్రమే పని చేసే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 31 లోపు ఎటిఎం వినియోగదారులు కొత్త ఏటీఎంలకు అప్లై చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఇండియా(RBI) తెలుపుతోంది. అంతేకాదు ఇక మీదట EMV ( యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా ) చిప్ బేస్డ్ కార్డులే వాడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే RBI ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) తన కస్టమర్ల కార్డులు మార్చుకోవాలని సందేశాలు పంపుతోంది. ఈ కొత్త EMV కార్డుల మీద ఎడమవైపు యాక్సెస్ చిప్ ఉంటుంది. ఈ క్రెడిట్ , డెబిట్ కార్డులను బ్యాంకులో మార్చుకోవచ్చనీ, ఇందుకు గాను ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని RBI వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories