విద్యారంగంలో సంస్కరణల పర్వం... భవిష్యత్తు ఏం చెబుతోంది

విద్యారంగంలో సంస్కరణల పర్వం... భవిష్యత్తు ఏం చెబుతోంది
x
Highlights

దేశంలో ఉన్నత విద్యారంగంలో సంస్కరణల పర్వం మొదలైంది. మరీ ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యపై కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇంజినీరింగ్...

దేశంలో ఉన్నత విద్యారంగంలో సంస్కరణల పర్వం మొదలైంది. మరీ ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యపై కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ అమలు చేయడంపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్నషిప్ తప్పనిసరి అంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రెండేళ్ళ క్రితమే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ ఆ నిబంధనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యార్థులు నాలుగో సంవత్సరంలో తమ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ తప్పనిసరి చేసింది. కోర్సు పూర్తయ్యే లోగానే విద్యార్థులు ఇంటర్న్ షిప్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 2018-19 విద్యాసంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఇంటర్న్ షిప్ చేసేందుకు అర్హులు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కరిక్యులమ్ ప్రకారం ప్రాజెక్ట్ వర్క్, సెమినార్, ఇంటర్న్ షిప్స్ కు 15 క్రెడిట్స్ కేటాయించారు. విద్యార్థులు ఆరు నుంచి ఎనిమిది వారాల ఇంటర్న్ షిప్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇంటర్న్ షిప్ ను తప్పని సరి చేయడం మంచిదే. అదే సమయంలో అది కచ్చితంగా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం జరిగేలా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంటర్మీడియట్ లో ప్రాక్టికల్స్ కు ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందే. కార్పొరెట్ కాలేజీలేవీ కూడా ప్రాక్టికల్స్ ను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే దుస్థితి ఇంటర్న్ షిప్ విధానానికి పట్టకుండా చూడాలి. మరీ ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంటర్న్ షిప్ తప్పుదోవ పట్టే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఆన్ లైన్ ఇంటర్న్ షిప్ పేరిట విద్యార్థులను మోసగించే అవకాశాలున్నాయి. వివిధ స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ అందిస్తూ, ఇంటర్న్ షిప్ కూడా ఆఫర్ చేస్తున్న సంస్థలు అధికమైపోయాయి. వీటిలో మోసపూరితమైనవే ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమలోని సంస్థలను, కాలేజీలను అనుసంధానం చేయడం ద్వారా బోగస్ సంస్థలను ఏరివేస్తూ, ఇంటర్న్ షిప్ ప్రమాణాలకు అనుగుణంగా జరిగేలా చూడాలి

యావత్ ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేనంగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు మన దేశంలో ఉన్నారు. ఏటేటా వీరి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఇంజినీరింగ్ కాలేజీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్ కాలేజీలు అత్యధిక సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. ఫీజు రిఇంబర్స్ మెంట్ లాంటివి కూడా ఈ కాలేజీలు పుట్టగొడుగుల్లా వచ్చేందుకు కారణమయ్యాయి. ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలు తక్కువగానే ఉన్నాయి. ఇంజినీరింగ్ చదువు మరీ ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో శిక్షణ అంతా కొన్ని బహుళజాతి సంస్థల అవసరాలను ప్రధానంగా తీర్చేదిగా సాగుతోంది. విద్యార్థులు సైతం ఆ కొన్ని కంపెనీల్లో ఉద్యోగం సాధించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కంప్యూటర్ సైన్స్ తో ముడిపడిన మిగితా రంగాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది... మరి ఈ పరిస్థితిని చక్కదిద్దలేమా ?

Show Full Article
Print Article
Next Story
More Stories