మరొ మూడున్నర నెలలలోపే..?

మరొ మూడున్నర నెలలలోపే..?
x
Highlights

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేశారు....

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఐదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి తమ రాజీనామా లేఖలతో నేరుగా స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి సుమిత్రా మహాజన్‌కు సమర్పించారు. అయితే, వాటిపై పునరాలోచించుకోవాలని ఆమె సూచించినప్పటికీ తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని వారు స్పష్టంచేశారు. దీంతో మరోసారి ఈనెల తొలి వారంలో వారితో సమావేశమై రాజీనామాల అంశంపై చర్చించగా వెనక్కి తగ్గేది లేదని ఎంపీలు స్పష్టంచేశారు. వారి నుంచి స్పీకర్‌ రీకన్ఫర్మేషన్ పత్రాలను కోరగా.. వాటినీ ఎంపీలు సమర్పించారు. ఆ తర్వాత 10 రోజుల పాటు మూడు దేశాల పర్యటనకు వెళ్లి ఈ నెల 19న భారత్‌కు చేరుకున్న స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌.. వైసీపీ ఎంపీల రాజీనామాల అంశంపై అధికారులతో సంప్రదింపులు జరిపారు. అన్ని సంప్రదింపులు పూర్తయ్యాక వారి రాజీనామాలకు ఆమోదముద్ర వేశారు. దీనిపై లోక్‌సభ సభాపతి కార్యాలయం బులిటెన్‌ విడుదల చేసింది. ఇదిలావుంటే ఖాళీ అయిన ఎంపీస్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయా లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. వాస్తవానికి ఖాళీ అయిన అసెంబ్లీ, లేదా పార్లమెంటుకు తిరిగి ఆరునెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి, ఆలా జరగని పక్షంలో ఎన్నికల సంగంపై సుప్రీం కోర్ట్ లేదా రాష్ట్రపతి చర్యలు తీసుకునే అధికారం ఉంది. సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా 10 నెలల సమయం ఉంది. ఒకవేళ ఎన్నికలు సకాలంలో జరిగితే ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయి. లేదా కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే అదికూడా ఆరునెలల లోపు అయితే ఉపఎన్నికలు కాకూండా సాధారణ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. బీజేపీ నాయకుల ఆలోచన బట్టి చూస్తే కేంద్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ డిసెంబర్ లోనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఇదే జరిగితే రాజీనామా చేసిన ఎంపీల స్థానాలకు ఉపఎన్నికలు రాకపోవచ్చు అనేది టీడీపీ వాదన. కానీ వైసీపీ నేతలు మాత్రం తమ ఎంపీలు ఏప్రిల్ ఆరవ తేదీన రాజీనామాలు చేశారు. అలాంటప్పుడు అదే తేదీ నుంచి చూసుకుంటే 8 నెలలు అవుతుంది. కనుక ఉపఎన్నికలు గ్యారెంటీ అంటున్నారు. వైసీపీ వాదనే కరెక్ట్ అయితే మరొ మూడున్నర నెలల ముందే ఉపఎన్నికలకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో.. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories