గోదావరి జిల్లాల్లో పురాతన నాగరికత.. ఇవిగో ఆధారాలు

గోదావరి జిల్లాల్లో పురాతన నాగరికత.. ఇవిగో ఆధారాలు
x
Highlights

ఉభయగోదావరి జిల్లాల్లో అత్యంత పురాతన నాగరికత వర్ధిల్లిందన్న దానికి ఆధారాలు దొరికాయ్‌. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎదుట అధికారులు ఈ మేరకు ప్రదర్శన...

ఉభయగోదావరి జిల్లాల్లో అత్యంత పురాతన నాగరికత వర్ధిల్లిందన్న దానికి ఆధారాలు దొరికాయ్‌. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎదుట అధికారులు ఈ మేరకు ప్రదర్శన కూడా నిర్వహించారు. 2017 నవంబర్ నుంచి పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన రుద్రమకోట, రాయన్నపేట గ్రామాల్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అనుమతి మేరకు తవ్వకాలు జరిపామని ఐఏఎస్‌ అధికారి వాణిమోహన్‌ తెలిపారు. క్రీస్తు పూర్వం మూడు, నాలుగు శతాబ్దాలకు చెందిన వివిధ లోహల వస్తువులు లభించాయని ఆమె చెప్పారు. ఎముకలు, అస్థికలు ,బొమ్మలు, ఎర్రమట్టి, నల్లమట్టితో చేసిన కుండలు, అరుదైన వస్తువులు ఇందులో దొరికాయి. పెద్ద పెద్ద సమాధులు లభ్యమయ్యాయి. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఉన్నాయి. వ్యక్తులు చనిపోయాక సమాధి చేసి అక్కడ వ్యక్తి హోదాకు తగ్గట్లు పెద్ద పెద్ద బండరాళ్లు పెట్టేవారని తేలింది. ఇప్పటికీ గిరిజనుల్లో ఆ సంస్కృతి ఉంది. చెంచులు దీన్ని పాటిస్తున్నారు. అప్పటి ధాన్యాలు ఇప్పటి పంటలు ఒక్కటే. 250 విగ్రహాలు లభించాయి. అన్ని హిందూమతానికి చెందినవే. హనుమంతుడు, శివపార్వతులు, కాళికాదేవి, దుర్గాదేవి విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. అయితే ఇవి ఎప్పటివి అన్న విషయం ఇంకా తేలలేదు. కొంతమంది క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరానికి చెందినవి అంటున్నారు. అందుకే వీటికాలాన్ని తెలుసుకునేందుకు పూణె ల్యాబ్స్ కి, సీసీఎంబీకి పంపిస్తున్నాం. వీటిలో కొన్నింటిని భద్రపరుస్తున్నారు. కేంద్రం నిధులిస్తే ఒక సైట్ మ్యూజియాన్ని నిర్మిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories