మోతాదుకు మించి మంచి నీరు తాగితే కోమాలోకి వెళతారా?

మోతాదుకు మించి మంచి నీరు తాగితే కోమాలోకి వెళతారా?
x
Highlights

సాధారణంగా ప్రతి వ్యక్తి ప్రతి రోజూ ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. కానీ, నీళ్లు మరీ ఎక్కువ తాగినా కూడా ప్రమాదమేనని తాజాగా పరిశోధకులు...

సాధారణంగా ప్రతి వ్యక్తి ప్రతి రోజూ ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. కానీ, నీళ్లు మరీ ఎక్కువ తాగినా కూడా ప్రమాదమేనని తాజాగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనిషి శరీరంలో అసలు ఎన్ని నీళ్లు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ ఉంటుందని, ఎక్కువ నీళ్లు తాగకుండా అదే ఆపుతుందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెపుతున్నారు.

అయినా పట్టించుకోకుండా ఎక్కువ నీళ్లు తాగితే 'హైపోనెట్రేమియా' అనే సమస్య వస్తుందంటున్నారు. దానివల్ల రక్తంలోని సోడియం గణనీయంగా పడిపోతుందన్నది వారి అభిప్రాయంగా ఉంది. దానివల్ల వాంతులు, వికారంతో మొదలుపెట్టి ఒక్కోసారి ఏకంగా మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. నీళ్లు మరీ ఎక్కువ తాగినపుడు మనిషి మెదడు కూడా స్పందించి ఆ విషయాన్ని తెలియజేస్తుందట.

మన శరీరానికి ఎంత కావాలో అంతే నీళ్లు తాగితే పర్వాలేదని, కేవలం దాహం వేసినప్పుడే తాగాలి తప్ప.. కావాలని నీళ్లు ఎక్కువగా తాగకూడదని పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్‌ ఫారెల్ తెలిపారు. ఇందుకోసం కొంతమందిని తీసుకున్న ఈ బృందం వారిలో సగం మందిని సరి

Show Full Article
Print Article
Next Story
More Stories