శ్రీకృష్ణుడి మరణానికి కారణం ఎవరో తెలుసా..?

శ్రీకృష్ణుడి మరణానికి కారణం ఎవరో తెలుసా..?
x
Highlights

కురుక్షేత్ర యుద్ధం.. మహాభారతం గురించి అందరికీ తెలిసిందే. మహాభారతం ద్వారా శ్రీ కృష్ణ పరమాత్ముడు జీవిత ధర్మాలను, అధర్మాలను తెలియజేశాడు. భగవద్గీతను...

కురుక్షేత్ర యుద్ధం.. మహాభారతం గురించి అందరికీ తెలిసిందే. మహాభారతం ద్వారా శ్రీ కృష్ణ పరమాత్ముడు జీవిత ధర్మాలను, అధర్మాలను తెలియజేశాడు. భగవద్గీతను లోకానికి ప్రసాదించాడు. శ్రీకృష్ణ లీలలు, పాండవులు, కౌరవుల గురించి మహాభారతం తెలియజేస్తుంది. అయితే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అయితే ఈ కథనం చదవండి.

18 రోజుల పాటు మహా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ద్వారా దేశంలోని 80 శాతం జనాభా మరణించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా, కౌరవులు ఓడిపోయారు. అయితే ఈ మహాయుద్ధానికి తర్వాత ఎవరెవరు ఊపిరితో ఉన్నారు.. ఎవరెవరు మరణించారనే విషయం కొందరికి తెలిసివుండవచ్చు. కొందరికి తెలియకపోవచ్చు. శ్రీకృష్ణుడు విష్ణు అవతారమైనా ఆయన మరణిస్తారా..? పాండవులు ఎలా ప్రాణాలు కోల్పోతారు.. అనే ఆసక్తికర అంశాల గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.

కురుక్షేత్ర యుద్ధానికి తర్వాత పాండవులు హస్తినాపుర రాజ్యానికి పాలకులవుతారు. కానీ కౌరవులను యుద్ధంలో కోల్పోయిన వారి తల్లి గాంధారి మాత్రం ఆవేదనతో కూడిన కోపంతో రగిలిపోతుంది. తాను ధర్మ ప్రకారం నడుచుకున్నప్పటికీ తన కుమారుల్లో ఒక్కడూ మిగలకపోవడంపై గాంధారి ఆవేశం వ్యక్తం చేస్తుంది. ఇదే కోపంలోనే పాండవుల రాజ్యాభిషేకానికి వచ్చిన శ్రీకృష్ణుడిని శపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానికి శ్రీకృష్ణుడే కారణమని దూషిస్తుంది. యాదవ వంశం నాశమైపోతుందని శాపనార్థాలు పెడుతుంది. అంతేగాకుండా.. శ్రీకృష్ణుడి మరణం కూడా దారుణంగా ఉంటుందని శపించింది.

ఈ శాపం ప్రకారం శ్రీకృష్ణుడు 36 ఏళ్ల తర్వాత మరణించినట్లు పురాణాలు చెప్తున్నాయి. గాంధారి శాపం ప్రకారమే.. ద్వారకలో అలజడులు చోటుచేసుకున్నాయి. ప్రజల్ని ప్రభాస క్షేత్రానికి తరలించినా.. ప్రజలు ఒకరినొకరు హింసించుకోవడం.. చంపుకోవడం మొదలెడతారు. ఇలా యాదవ కులం అంతమవుతుంది. ఈ సందర్భంలోనే ఓ వేటగాడు వదిలిన బాణానికి శ్రీకృష్ణుడు శరీరాన్ని వీడి విష్ణుదేవుని అవతారంలో దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడి కాలికి గుచ్చుకున్న బాణమే ఆ ప్రాణాలను హరిస్తుంది.

ఇక పాండవుల సంగతికి వస్తే.. పాండవులు తమ జీవిత గమ్యాన్ని చేరుకుంటారు. అయితే ద్వాపర యుగం పూర్తయ్యి, కలియుగం ప్రారంభమయ్యే సమయంలో పాండవులు తమ ధర్మపత్రి ద్రౌపదితో కలిసి స్వర్గ లోకానికి చేరేందుకు హిమాలయాలను ఎక్కేందుకు ఆరంభిస్తారు. మధ్యదారిలో యమధర్మరాజు ఓ శునకంలా మారువేషంలో పాండవుల ప్రయాణంలో కలిసిపోతాడు. దారిలోనే ద్రౌపదితో పాటు భీముడి వరకు ఒక్కొక్కరిగా నేలరాలిపోతారు. వారికి నరకం ప్రాప్తిస్తుంది.

కానీ ధర్మరాజు మాత్రం స్వర్గం వరకు చేరుకుంటారు. శునకం రూపంలో వారితో కలిసిన యమధర్మరాజు అసలు రూపం ధరిస్తాడు. ఇలా యముడు ధర్మరాజు స్వర్గలోనికి ప్రవేశించే ముందు… నరక లోకంలో అతని సోదరులు, భార్య, వారు చేసిన పాపాలకి ఎలాంటి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారో చూపిస్తాడు. ఆ తరువాత స్వర్గలోకాధిపతి ఇంద్రుడు యధిష్టిరుడుని స్వర్గలోకానికి తీసుకెళ్తాడు.

ఇలా శ్రీకృష్ణుడు, పాండవులు సాధారణ జీవితానికి స్వస్తి చెప్పి.. భూలోకాన్ని వీడి వెళ్ళాకే కలియుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. కలి ప్రారంభమై సంవత్సరాలు గడుస్తోంది.. కలియుగాంతం ఎప్పుడు జరుగుతుందనే విషయం శాస్త్రవేత్తల అంచనాలకు సైతం అందట్లేదు. అరాచకాలు, మహిళలపై హింసలు పెరిగే సమయంలో తాను అవతరిస్తారని చెప్పిన శ్రీకృష్ణుడు కలియుగంలో ఏ రూపంలో అరాచకాలను, పాపాలను హరించేందుకు ఏ అవతారం ఎత్తుతాడో మరి!

Show Full Article
Print Article
Next Story
More Stories