పైరసీ లింక్ ప్రత్యక్షం..దండం పెట్టిన ప్ర‌ముఖ‌ డైరెక్టర్

పైరసీ లింక్ ప్రత్యక్షం..దండం పెట్టిన ప్ర‌ముఖ‌ డైరెక్టర్
x
Highlights

కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నా పైర‌సీ భూతాన్ని అరిక‌ట్ట‌లేక సినీ ఇండ‌స్ట్రీలు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దర్శకుడు విజ్ఞేశ్ శివన్ త‌మిళంలో...


కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నా పైర‌సీ భూతాన్ని అరిక‌ట్ట‌లేక సినీ ఇండ‌స్ట్రీలు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దర్శకుడు విజ్ఞేశ్ శివన్ త‌మిళంలో “తానా సేరందా కూట్టం”, తెలుగులో గ్యాంగ్ గా విడుద‌ల చేశారు. అయితే పైర‌సీని రిలీజ్ చేయ‌డంలో ముందుండే ‘తమిళ్ రాకర్స్’ వెబ్ సైట్ శివ‌న్ తీసిన సినిమాను కూడా అలాగే సైట్లో పోస్ట్ చేసింది. ఈ విష‌యం తెలుసుకున్న డైర‌క్ట‌ర్ వెబ్ సైట్ కు దండం పెడుతూ “తమిళ రాకర్స్ టీం సభ్యులారా… సినిమాను ఎంతో క‌ష్ట‌ప‌డి తీసి విడుద‌ల చేసాం. దయచేసి మా సినిమాల్ని పైర‌సీ చేసి ఇలా వెబ్ సైట్లో పెట్ట‌కండీ అంటూ రిక్వ‌స్ట్ చేశారు. ఇలా అక్క‌డే కాదండోయ్ త్రివిక్ర‌మ్ - ప‌వ‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన “అజ్ఞాతవాసి” కూడా మొదటిరోజే సదరు వెబ్ సైట్ లో ప్రత్యక్షమైంది. ఓ పక్కన సినిమాలకు వస్తున్న డివైడ్ టాక్, మరో పక్కన పైరసీ దెబ్బతో… కళకళలాడాల్సిన ధియేటర్లు వెలవెలబోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories