ఇవాళ ఢిల్లీలో ఆవిష్కృతం కానున్న అద్భుతం

ఇవాళ ఢిల్లీలో ఆవిష్కృతం కానున్న అద్భుతం
x
Highlights

ఇవాళ(అక్టోబర్ 4) ఢిల్లీలో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు చేపట్టిన ఐకానిక్ బ్రిడ్జిని ఢిల్లీ...

ఇవాళ(అక్టోబర్ 4) ఢిల్లీలో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు చేపట్టిన ఐకానిక్ బ్రిడ్జిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం ఇస్తారు. నవంబరు 5నుంచి ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. 2004 లో మొదలైన దీని నిర్మాణం దాదాపు 14 ఏళ్లకు పూర్తయింది. యమునా నదిపై నిర్మితమైన ఈ బ్రిడ్జి 575 మీటర్ల పొడవు, 35.2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 1575 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. దీని వల్ల ఢిల్లీలోని వజీరాబాద్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ సమస్య తగ్గిపోనుంది. తద్వారా ప్రయాణం సులువు అవ్వనుంది. కాగా భారత్‌లో మొట్టమొదటి అసిమ్మెట్రికల్‌ కేబుల్‌ స్టేయిడ్‌ బ్రిడ్జిగా ఈ ఐకానిక్ బ్రిడ్జి గుర్తింపు పొందింది. దీనిపై 150 మీటర్ల ఎత్తైన గ్లాస్‌ బాక్స్‌ ప్రత్యేక ఆకర్షణ కాగా.. ఈ గ్లాస్‌ బాక్స్‌లో నాలుగు ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. దీనినే సెల్ఫీ స్పాట్‌ అంటారు. ఒకేసారి 50 మందిని మోసుకు వెళ్ల గల గ్లాస్‌ బాక్స్‌ గుండా యమునా నది అందాలతో పాటు, సిటీ మొత్తాన్ని వీక్షించవచ్చు. పద్నాలుగేళ్ల కిందట ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు మధ్య మధ్యలో వాయిదా పడుతూ.. ఫైనల్ గా ఈ ఏడాదే పూర్తయ్యాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories