ఎవరికీ దక్కునో ఆ సీటు..

ఎవరికీ దక్కునో ఆ సీటు..
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఇప్పుడిప్పుడే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తేరుకుంటోంది. మరో నాలుగు నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో...

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఇప్పుడిప్పుడే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తేరుకుంటోంది. మరో నాలుగు నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఇప్పటినుంచే గెలుపుగుర్రాలను వెతికే పనిలో పడింది ఆ పార్టీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దిగ్గజ కాంగ్రెస్ నేతలు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్నారు. అయితే కొందరు ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ లోక్ సభ టికెట్ కు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లు రవి లు పోటీపడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన జైపాల్ రెడ్డి ఈ సీటును వదులుకుంటాడా అన్న సందేహం నెలకొంది. మరోవైపు జైపాల్ రెడ్డి స్థానంలో రేవంత్ కు హైక‌మాండ్ అవకాశం ఇస్తుంద‌ని కేడర్ చెబుతోంది. ఒకవేళ జైపాల్‌కు టికెట్ ఇవ్వాల్సి వ‌స్తే మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయిస్తారంటున్నారు. అలాగే మాజీ ఎంపీ మల్లు రవి కూడా మహబూబ్ నగర్ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని తనకు అవకాశం కల్పించాలని మల్లు రవి కోరుతున్నట్టు సమాచారం. మరి అధిష్టానం వారి అభ్యర్ధనను పరిగణలోకి తీసుకుంటుందా? లేక నీరుగార్చి.. కొత్తవారికి అవకాశం ఇస్తుందా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories