మళ్లీ నోరుజారిన షా, ఈసారి

మళ్లీ నోరుజారిన షా, ఈసారి
x
Highlights

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం కాసేపు పక్కనబెడితే.. తాజాగా మరోసారి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య...

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం కాసేపు పక్కనబెడితే.. తాజాగా మరోసారి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ప్రశంసించేలా వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. సిల్క్‌ ఉత్పత్తిలో దేశంలోనే కర్ణాటక అగ్రస్థానంలో ఉందని కొనియాడారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్‌ ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ‘మరోసారి నిజాలు మాట్లాడిన అమిత్‌ షాకు కృతజ్ఞతలు. మీరు మా స్టార్‌ ప్రచారకర్తగా మారుతున్నారు. 2016-17 సంవత్సరంలో కర్ణాటకలో సిల్క్‌ ఉత్పత్తి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది’ అని కర్ణాటక కాంగ్రెస్‌ ట్వీట్ చేసింది.

ఇటీవల ఓ ప్రచార సభలో పాల్గొన్న అమిత్‌ షా తన ప్రసంగంలో పొరబడిన విషయం తెలిసిందే. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిమయం అని అనబోయి.. యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అన్నారు. దీంతో పక్కనే ఉన్న యడ్యూరప్ప కంగు తిన్నారు. ఆ తర్వాత మరో నేత సాయంతో తన పొరబాటును సరిదిద్దుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అమిత్‌ షా హిందీ ప్రసంగాన్ని కన్నడలోకి తర్జుమా చేసే సమయంలో పొరబాటు జరిగింది. హిందీలో షా అన్న వ్యాఖ్యలను మరో భాజపా నేత కన్నడలోకి అనువదిస్తూ.. ప్రధానమంత్రి దేశాన్ని నాశనం చేశారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories