ధోని రిటైర్మెంట్‌పై కోచ్‌ క్లారిటీ!

ధోని రిటైర్మెంట్‌పై కోచ్‌ క్లారిటీ!
x
Highlights

మిస్టర్ కూల్ ధోనీ ఇప్పుడు మరీ కూలయ్యాడు. అతని బ్యాట్ నుంచి ఆశించినంతగా పరుగులు ప్రవహించడంలేదు. దీంతో ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్న విషయం...

మిస్టర్ కూల్ ధోనీ ఇప్పుడు మరీ కూలయ్యాడు. అతని బ్యాట్ నుంచి ఆశించినంతగా పరుగులు ప్రవహించడంలేదు. దీంతో ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ వన్డేలో ఆట ముగిసిన తర్వాత అంపైర్ నుంచి ధోనీ బాల్ తీసుకోవడం కొంత వివాదానికి తెరలేపింది. దానిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఓ క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్‌ వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధోని ఎటూ వెళ్లటం లేదు.. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. బంతిని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు. మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి ఒక జనరల్‌ ఐడియా కోసం తీసకున్నాడే తప్పా ఏ రిటైర్మెం‍ట్‌ ఉద్దేశం లేదు’ అంటూ రవిశాస్త్రి ‘ధోని-బంతి’ మిస్టరీపై వివరణ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories