ఏపీలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఏపీలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
x
Highlights

తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరిగాయి. ఏపీలో కేసీఆర్ కు ఫ్యాన్స్...

తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరిగాయి. ఏపీలో కేసీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలను శనివారం ఘనంగా జరిపారు. ఖాదర్ అనే వ్యక్తి కేసీఆర్‌కు వీరాభిమాని. దీంతో కేసీఆర్ పుట్టిన రోజును పురష్కరించుకుని ఓ ఫ్లెక్సీ ఏర్పాటుచేసి అనాథాశ్రమంలో మహాన్నదానం నిర్వహించారు. అలాగే సాకలి చెరువు వద్ద కేక్ కట్ చేశారు. అంతేగాక పేదలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఖాదర్ మాట్లాడుతూ... తెలంగాణ కోసం కేసీఆర్ రాజీలేని పోరాటం చేశారని, కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించారన్నారు. కేసీఆర్ స్పూర్తితో ఆంధ్ర నాయకులు సిగ్గు తెచ్చుకోని, ప్యాకేజీ కోసం కాకుండా హోదా కోసం పోరాటం చేయాలన్నారు. ప్రత్యేక హోదా మన హక్కు.. అది పోరాటంతోనే సాధ్యం అని ఖాదర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories