అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకుంటున్న చిరంజీవి

అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకుంటున్న చిరంజీవి
x
Highlights

మెగ‌స్టార్ చిరంజీవి కావాల్సినంత అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకుంటున్నారు. ఓ వైపు ఏపికి ప్ర‌త్యేక హదా కోసం ఆందోళ‌న జ‌రుగుతుంటే రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న...

మెగ‌స్టార్ చిరంజీవి కావాల్సినంత అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకుంటున్నారు. ఓ వైపు ఏపికి ప్ర‌త్యేక హదా కోసం ఆందోళ‌న జ‌రుగుతుంటే రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న చిరంజీవి త‌న స్టాండ్ ఏంటో చెప్పే ప్ర‌య‌త్నం చేసింది లేదు. దీనికి తోడు త‌న కుమారుడు రాంచ‌ర‌ణ్ న‌టించిన రంగ స్థ‌లం ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కు హాజ‌ర్వ‌డం వివాదాస్ప‌దంగా మారింది.
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలని టీడీపీ - వైసీప - జ‌న‌సేన‌లు ఆందోళ‌న బాట‌ప‌ట్టాయి. ఓ వైపు జాతీయ కాంగ్రెస్ ప్లీన‌రీలో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ తీర్మానించింది. కానీ చిరంజీవి మాత్రం ఏవిధమైన కామెంట్స్ వినిపించ‌క‌పోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది.
ఎపికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎపికి చెందిన అన్ని పార్టీలు తిరుగుబాటు చేస్తుంటే...కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం ఎపి ప్రత్యేక హోదా మీదే నని అంటుంటే..అదే పార్టీ తరపున రాజ్య సభ ఎంపీగా ఉన్న ఎపి మెగాస్టార్ చిరంజీవి మాత్రం అసలు తనకు ఈ విషయంతో సంబంధమే లేనట్లుగా వ్యవహరిస్తుండటం ద్వారా చెప్పలేనంత అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వాన్ని చ‌విచూసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ..ఎంతో సీనియర్లు అయిన...వయసు పైబడిన కెవిపి లాంటి నేతలు సైతం ప్రత్యేక హోదా కోసం మేము సైతం అంటూ తమ వంతు తాముగా వివిధ రకాలుగా నిరసన తెలుపుతూ పోరాటం చేస్తుంటే...ఎంతో జనాకర్షణ కలిగిన...చిరంజీవి లాంటి వ్యక్తి సైలెంట్ గా ఉండి పోవడం ఏ రకంగా చూసినా సమంజసం కాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవేళ తాను రాజకీయాల నుంచి విరమించుకో దలిచినా...ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా...ఒక రాజకీయ పార్టీ నుంచి పదవిని అనుభవిస్తున్ననేతగా... ప్రత్యేక హోదా విషయమై తన అభిప్రాయం ప్రకటించాల్సిన బాధ్యత తప్పకుండా చిరంజీవిపై ఉందంటూ ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి. పోనీ ఆయన ఘూటింగుల్లో బిజీగా ఉన్నారా అంటే అదీ లేదని నెటిజన్లే సమాచారం ఇచ్చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories