తమ్ముళ్ల జోష్‌... పసుపు పండగ భేష్‌...

తమ్ముళ్ల జోష్‌... పసుపు పండగ భేష్‌...
x
Highlights

టీడీపీ పసుపు పండుగలో ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఉత్సాహంతో కనిపించారు. దేశ రాజకీయాలను మార్చే శక్తి తెలుగుదేశం పార్టీ ఉందంటూ కార్యకర్తల్లో జోష్ నింపే...

టీడీపీ పసుపు పండుగలో ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఉత్సాహంతో కనిపించారు. దేశ రాజకీయాలను మార్చే శక్తి తెలుగుదేశం పార్టీ ఉందంటూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు, ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తామన్న ఆయన...ఏపీ, తెలంగాణలకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు.

నవ్యాంధ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 34వ మహానాడును ప్రారంభించిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. 70 లక్షల మంది కార్యకర్తలున్న ఏకైక పార్టీ టీడీపీనే అన్నారు. విజయవాడ విజయానికి నాంది అన్న ఆయన...రాబోయే రోజుల్లో అన్నింటా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మహానాడులో చంద్రబాబు ...ప్రధాన మంత్రి మోడీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ...పనులు తక్కువన్నారు. మోడీ పథకాలతో ఎవరైన బాగుపడ్డారా అన్న ఆయన....నోట్ల రద్దుతో బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల్లో మంచి నాయకత్వం ఉందన్న చంద్రబాబు...సమర్థవంతమైన నాయకులున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీల నాయకులను దెబ్బతీయాలని చూస్తే...బొబ్బిలి పులిలా, కొండవీటి సింహాల్లా గర్జిస్తారని హెచ్చరించారు. దక్షిణాదిలో దొడ్డి దారిలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని...అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు సీఎం చంద్రబాబు. బీజేపీ నేతలకు అధికారంపై వ్యామోహం తప్పా...అభివృద్ధి అవసరం లేదని విమర్శించారు.

బీజేపీ కుట్రలో భాగంగానే తిరుపతి ఆభరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన....టీటీడీనీ మోడీ కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వెంకన్న జోలికి వస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని అన్నారు.
ఒక వర్గాన్ని కావాలనే అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారన్న చంద్రబాబు...రాజకీయాల కోసం మత విద్వేషాలు సృష్టిస్తే మంచిది కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న ఆయన...బీజేపీకి అధికారంలోకి వచ్చేది కల్ల అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లలో...రాష్ట్రానికి చేసిందేమీ లేదన్న చంద్రబాబునాయుడు...స్వశక్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా... అనుకున్నది సాధించి తీరుతామని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories