బీజేపీకి ఏపీ అంటే ఎంత చిన్న‌చూపో..?

బీజేపీకి ఏపీ అంటే ఎంత చిన్న‌చూపో..?
x
Highlights

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌లన్నా కేంద్రంలోని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు, అధికార గ‌ణానికి ఎంత‌టి అక్క‌సో వెల్ల‌డించే విష‌యం ఇది. తానే గొంతు నులిమి...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌లన్నా కేంద్రంలోని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు, అధికార గ‌ణానికి ఎంత‌టి అక్క‌సో వెల్ల‌డించే విష‌యం ఇది. తానే గొంతు నులిమి రోడ్డున ప‌డేసిన ద‌క్షిణాది రాష్ట్ర‌మైన ఏపీ అంటే కేంద్రంలోని బీజేపీ నేత‌ల‌కు ఎంత‌టి చిన్న‌చూపో తెలియజేసే ఉదంతం ఇది. పార్ల‌మెంట్‌లో త‌లుపులు మూసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీల‌పై దాడులు చేసి వారి నోళ్లు మూయించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని ముక్క‌లు చేస్తుంటే తాను ఓ చేయి వేసిన బీజేపీ ఇప్పుడు నేరుగా తానే మిగిలిన ప్రాణాన్ని తీయాల‌ని చూస్తోంది. రాష్ట్రానికి ప్ర‌త్యేక రైల్వే జోన్ ఇవ్వాల‌ని, అది విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొంది. అప్ప‌టి ప్ర‌తిప‌క్షం బీజేపీ దానికి వ‌త్తాసు ప‌లికింది. ఇప్పుడు దానిని తామే అమ‌లు చేయాల్సి వ‌చ్చేస‌రికి త‌ప్పించుకోవ‌డానికి కార‌ణాలు వెతుకుతోంది. పైగా రాష్ట్రాన్ని తీవ్రంగా అవ‌మానిస్తోంది.
నిన్న‌టికి నిన్న ఏపీ తీరు చూడ‌బోతే దేశ ర‌క్ష‌ణ‌కు కేటాయించిన నిధులు కూడా అడిగేట్లు ఉన్నారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన దురంహాకార‌పూరిత వ్యాఖ్య‌లు పెను దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. దానిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు జైట్లీని మించి రైల్వే అధికారులు మ‌రింత దారుణంగా మాట్లాడుతున్నారు. విభ‌జ‌న చ‌ట్టం సాక్షిగా ఏపీకి రావాల్సిన రైల్వే జోన్‌ను ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని తేల్చేసిన రైల్వే బోర్టు ‘అసలు రైల్వేజోన్‌తో ఏమొస్తుంది? ఒక జనరల్‌ మేనేజర్‌ కొత్తగా కూర్చుంటారు. మరికొందరు ఉద్యోగులు వస్తారంతే!’ అని వితండవాదం చేస్తోంది. త‌ద్వారి ఏపీపై తీవ్ర వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. ‘మీకు రైల్వేజోన్‌ కావాలా? రైల్వే లైన్‌ కావాలా?’ అని ప్రశ్నించింది. ఇదొక్కటే కాదు… రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న హామీల అమలు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబాతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు.
ఏపీకి సంబంధించి 14 అంశాలతో కూడిన 23 పేజీల నివేదికను కేంద్రానికి అందించారు. రైల్వే జోన్‌ విషయానికి వచ్చేసరికి, ఇది సాధ్యం కాదని గతంలో ఇచ్చిన నివేదిక గురించి కేంద్రం గుర్తు చేసింది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పడి తీరాలని, కేంద్రం మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గట్టిగా అడిగారు. అలాగైతే ఆ రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాల్సింది కేంద్ర హోంమంత్రే అని బోర్డు చైర్మన్‌ చెప్పారు. నెలరోజుల్లో హోం మంత్రివద్ద సమావేశం ఏర్పాటు చేద్దామని, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా పిలుద్దామని అన్నారు. దుగరాజపట్నం పోర్టు ఆర్థికంగా లాభదాయకం కాదనడంతో, దానికి ప్రత్యామ్నాయంగా రామాయపట్నంలో పోర్టును ఏర్పాటు చేయాలని సీఎస్‌ కోరారు. కడపలో ఉక్కు కర్మాగారంపై మెకాన్‌ సంస్థ త్వరలోనే తుది ఏపీ అధికారులు స్పందిస్తూ… మరోసారి టాస్క్‌ఫోర్స్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నివేదిక ఇస్తుందని సంబంధిత శాఖ అధికారులు అన్నారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఐఐఎం తదితర సంస్థలకు సంబంధించిన భవన నిర్మాణాలు కూడా మొదలుపెట్టలేదని రాష్ట్ర ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత శాఖలను హోం కార్యదర్శి ఆదేశించారు. కాకినాడ వద్ద ప్రతిపాదించిన పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌కు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌గా రాష్ట్రం నుంచి రూ.5,600 కోట్లు ఇవ్వాలని కేంద్రం అడుగుతోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 14శాతం కట్టాలంటోంది. అసోం, రాజస్థాన్‌లలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేశామని, అక్కడ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం వ్యయంలో 14శాతం వ్యయం భరించాయని కేంద్ర ప్రతినిధులు పేర్కొన్నారు. ఒకవేళ అలా కట్టాల్సి వస్తే దాన్ని 12శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రతినిధులు కోరినట్లు తెలిసింది. ఆ 12శాతం కూడా కేంద్రం వడ్డీలేని అప్పుగా ఇవ్వాలని, 15 ఏళ్ల తర్వాత దాన్ని వాయిదాల పద్దతిలో తీరుస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో పాటు మరో కారిడార్‌ ఏర్పాటుపైనా చర్చ జరిగింది. వీటిని నేషనల్‌ కారిడార్‌లో భాగంగా తీసుకుంటామని కేంద్ర ప్రతినిధులు చెప్పారు. అలా నేషనల్‌ కారిడార్‌లో భాగమైతే 51శాతం నిధుల్ని కేంద్రం, 49 శాతం రాష్ట్రం పెట్టాల్సి ఉంటుంది. ఇది కొంతమేర రాష్ట్రానికి వెసులుబాటుగానే ఉంటుందని సూచించారు. దీనిపై తమ ముఖ్యమంత్రితో మాట్లాడతామని రాష్ట్ర ప్రతినిధులు తెలిపారు. ఈ కారిడార్‌ విషయంలో కొంత పురోగతి ఉందని, రెండు నోడ్స్‌కు సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర అధికారులు తెలిపారు. అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, విశాఖపట్నం జిల్లాలో గిరిజన వర్సిటీ కోసం కేబినెట్‌ నోట్‌ వెళ్లిందని… కేంద్ర మంత్రి మండలి దాన్ని ఆమోదించాక లోక్‌సభకు బిల్లు వస్తుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories