ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ
x
Highlights

ఏపీలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటోంది. సిబిఐ మాజీ అధికారి, లక్ష్మీనారాయణ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. అయితే ఆయనే స్వయంగా పొలిటికల్...

ఏపీలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటోంది. సిబిఐ మాజీ అధికారి, లక్ష్మీనారాయణ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. అయితే ఆయనే స్వయంగా పొలిటికల్ పార్టీని షెర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు నిన్న(శనివారం) తిరుపతిలో లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఒక ఎన్జీవోగా ఉండటం వల్ల కొంతమేర మాత్రమే ప్రభావితం చేస్తామని రాజకీయాల్లోకి రావడం వల్ల ఎక్కువ మందిని ప్రభావితం చేయవచ్చని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. అలాగే కొత్తపార్టీ, పొత్తులు మాట్లాడిన అయన తన ఆలోచనలు పంచుకుని, వాటిని అనుసరించే పార్టీలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఇదిలావుంటే తాను యువత భవిష్యత్, రైతుల సంక్షేమం కోసం అయన రాజకీయాల్లోకి రానున్నట్టు గతంలో చెప్పారు. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన అయన జనం బాటపట్టారు. గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, చిత్తూర్ జిల్లాలో రైతుల్ని కలిసి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వ్యవసాయ పద్దతులు, పంటలపై నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకున్నారు. మరోవైపు ఉద్యోగానికి మధ్యలోనే రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న అయన మొదట టీడీపీ లేదా బీజేపీలో చేరతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కొత్త పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories