ఆ 5కోట్ల‌లో నా ప్ర‌మేయం లేదు : మ‌త్త‌య్య

ఆ 5కోట్ల‌లో నా ప్ర‌మేయం లేదు : మ‌త్త‌య్య
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు రోజుకో మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసు సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఏ4...

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు రోజుకో మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసు సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య అత్య‌న్నుత న్యాయ స్థానానికి లేఖ రాయడం ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో ఆ కేసు ఏమ‌లుపు తిరుగుతుందోన‌ని తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.
నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు టీటీడీపీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే గా ఉన్న స్టీఫెన్ స‌న్ తో బేరం కుదుర్చుకుంది. టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వ‌చ్చేలా రూ. 5కోట్లు , అడ్వాన్స్ కింద రూ. 50ల‌క్ష‌లు ఇవ్వ‌జూపింది. కానీ విచిత్రంగా స్టీఫెన్ స‌న్ - టీడీపీ కి మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాలు వీడియోల రూపంలో బ‌ట్ట బ‌య‌ల‌య్యాయి. అంతేకాదు సీఎం చంద్ర‌బాబు స్టీఫెన్ స‌న్ తో ఫోన్ లో మాట్లాడిన‌ట్లు అభియోగాలు వ‌చ్చాయి. ఓటుకు నోటు కేసుపై స‌మాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో భాగంగా రేవంత్ రెడ్డి, సెబాస్టియ‌న్, ఉద‌య్ సిన్హాల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో టీడీపీ నేత అని ప్రచారంలో ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఏసీబీ అభియోగం మోపింది. కానీ మ‌త్త‌య్య అందుబాటులో లేక‌పోవ‌డం, ఏపీలో త‌ల‌దాచుకున్న‌ట్లు అనుమానం వ్య‌క్తం చేసింది ఏసీబీ. అదే స‌మ‌యంలో ముగ్గురు నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, సెబాస్టియ‌న్, ఉద‌య్ సిన్హాల‌కు కేసు ఇవ్వ కూడ‌ద‌ని ఏసీబీ కోర్టులో వాదించింది. దీంతో వెలుగులోకి వ‌చ్చిన మ‌త్త‌య్య త‌న‌పై కేసు న‌మోదు కాకుండా బెయిల్ పిటిష‌న్ వేశారు.
ఆ త‌రువాత ఆ ముగ్గురు నిందితులు బెయిల్ పై విడుద‌ల‌వ్వ‌డం. కేసు వీగిపోయిందని ఆరోప‌ణ‌లు రావ‌డం. స్టీఫెన్ స‌న్ ఇంటికి మ‌త్త‌య్య వెళ్లి రావ‌డంలాంటి వ‌రుస ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.
దీంతో మ‌త్త‌య్య‌పై కేసు న‌మోదు చేసి హైకోర్టు విచార‌ణ‌కు ఆదేశించింది. ఇరువర్గాలకు జెరూసలేం మత్తయ్యనే మధ్యవర్తిగా పని చేశాడని భావించారు.
కానీ కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు రావ‌డంతో త్వ‌ర‌లో విచార‌ణ జ‌ర‌గునుంది. ఈ నేప‌థ్యంలో మ‌త్త‌య్య వెలుగులోకి వ‌చ్చారు. తనకు ఓటుకు నోటుకు, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం లేదంటూ సుప్రీం కోర్టు జ‌డ్జికి లేఖ రాశారు.
అంతేకాదు తాను ఎవ‌రి స‌హ‌యం లేకుండా అన్నీవివారాల్ని సుప్రీం కోర్టు కు చెప్ప‌నున్న‌ట్లు తెలిపారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసు సమయంలో స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లి అతని కొడుకుతో క్రిస్టియన్ కమ్యూనిటీ వ్యవహారాలు మాట్లాడినట్లు మత్తయ్య చెప్పారు. మరోవైపు టీడీపీ ప్లీనరీ సందర్భంగా రేవంత్, చంద్రబాబులతో మాట్లాడినట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories