రైతులు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

రైతులు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
x
Highlights

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయమే ఉన్నందున ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ క్రమంలో రైతులు,...

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయమే ఉన్నందున ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ క్రమంలో రైతులు, నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. చెక్కెర రంగానికి 4500 కోట్ల ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చెరకు పండించే వారికి ఇచ్చే ఉత్పత్తి సాయం… ఎగుమతి చేసే మిల్లులకు ఇచ్చే రవాణా సబ్సిడీ రెండు రెట్లకు పైగా పెరిగింది. చెరకు రైతుల కోసం గత జూన్‌లో 8500 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అలాగే షుగర్‌కేన్‌ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు సామర్థ్యం పెంచుకునేందుకు చెరకు రైతులకు ఆర్థికసాయం అందించాలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు డిజిటైజషన్ లో భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ 5జీ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను విస్తృతం చేయాలని కేంద్రం అనుకుంటోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి సరసమైన ధరలో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. ఒక సెకనుకు 50 మెగాబైట్ల వేగంతో 5జీ సేవలను అందుబాటులోకి రావాలని.. దాంతో 2020 నాటికి దేశంలో 40లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముందని కేంద్ర క్యాబినెట్ అంచనా వేసింది. ఈ లక్ష్యం నెరవేరినట్టయితే దేశంలో 40 లక్షల మందికి నిరుద్యోగ సమస్య తీరినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories