స్నేహితుడిని చంపి.. తలతో పోలీస్‌ స్టేషన్‌కు..

స్నేహితుడిని చంపి.. తలతో పోలీస్‌ స్టేషన్‌కు..
x
Highlights

తన అమ్మను తిట్టినందుకు ఓ వ్యక్తి అతని స్నేహితుడిపై దారుణానికి పాల్పడ్డాడు. అతడి తల నరికి ఏకంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో...

తన అమ్మను తిట్టినందుకు ఓ వ్యక్తి అతని స్నేహితుడిపై దారుణానికి పాల్పడ్డాడు. అతడి తల నరికి ఏకంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మండ్య జిల్లాలోని చిక్కబాగిలుకి చెందిన పశుపతి (28), హతుడు గిరీశ్‌ (38) ఇద్దరు స్నేహితులు. ఇటీవల గిరీశ్‌.. ఒక విషయంలో పశుపతి తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో అప్పటినుంచి పశుపతి.. గిరీష్ పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం మాట్లాడాలని గిరీశ్‌ను ఊరిబయటకు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి చంపాడు. అంతేకాదు అతడి తలతో 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఆ తలతో వచ్చి లొంగిపోయాడు. ఎవరైనా తన తల్లిని ఏమైనా అంటే తట్టుకోలేనని.. అలాంటిది అసభ్యంగా ప్రవర్తిస్తే ఇలాగె చేస్తానని పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తోంది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories