బాలుడు చేసిన పని.. తల్లిదండ్రుల్ని తలదించుకొనేలా చేసింది

బాలుడు చేసిన పని.. తల్లిదండ్రుల్ని తలదించుకొనేలా చేసింది
x
Highlights

తెలిసీ తెలియని వయస్సులో ఓ బాలుడు చేసిన నిర్వాకం అతని తల్లిదండ్రుల్ని తలదించుకొనేలా చేసింది. ఫోన్ లో అమ్మాయిలు స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తూ...

తెలిసీ తెలియని వయస్సులో ఓ బాలుడు చేసిన నిర్వాకం అతని తల్లిదండ్రుల్ని తలదించుకొనేలా చేసింది. ఫోన్ లో అమ్మాయిలు స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. అందులో మహిళల వీడియోలు చూసి పోలీసులు నాలుక్కరుచుకున్నారు. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన చోటుచేసుకుంది. అతడు ఏడవ తరగతి చదువుతున్న బాలుడి(12) కుటుంబం మాదాపూర్ లో నివసిస్తోంది. వారి ఇంటికి ఆనుకొని బాలికల హాస్టల్ ఉంది. ఆక్కడ చాలా మంది ఉద్యోగినులు ఉంటున్నారు. కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసైన ఆ బాలుడు పక్కనే ఉన్న అమ్మాయిల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మాయిల స్నానం చేస్తుండగా రహస్యంగా వారిని ఫోన్ కెమరాతో చిత్రీకరించాడు. ఇదేక్రమంలో ఈ నెల 16న సాయంత్రం ఓ యువతి స్నానం చేస్తూ కిటికీ దగ్గర ఏదో శబ్దం వస్తున్నట్టు గుర్తించింది. దాంతో కిటికీలోనుంచి చూడగా పక్కింటి బాలుడు చేతిలో ఫోన్ పట్టుకుని పరుగులు తీస్తున్నాడు. వెంటనే సదరు యువతి హాస్టల్‌ నిర్వాహకులకు సమాచారం అందించింది. వారు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు వద్దనున్న ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 30 అసభ్య వీడియోలు వున్నట్టుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories