సీను మారింది... ప్లాన్‌ మారుతుందా? బీజేపీ టార్గెట్‌ బాబేనా?

సీను మారింది... ప్లాన్‌ మారుతుందా? బీజేపీ టార్గెట్‌ బాబేనా?
x
Highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకుండా హంగ్ ఏర్పడటంతో కర్ణాటక తర్వాత తమ నెక్స్ట్...

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకుండా హంగ్ ఏర్పడటంతో కర్ణాటక తర్వాత తమ నెక్స్ట్ టార్గెట్ ఏపినే అన్న బిజెపి ఏం చేస్తుంది? దక్షిణాదిన అడుగు పెట్టడం అంత ఈజీ కాదని కమలానికి తెలిసొచ్చిందా? కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపి పై దృష్టి పెడతామంటున్న బిజెపి ఇప్పుడేం చేస్తుంది?కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఏపిపై పడుతోంది. ఏపికి అన్యాయం చేసిన బిజెపిని చిత్తుగా ఓడించాలంటూ కర్ణాటకలో తెలుగు ఓటర్లకు ఏపి సిఎం చంద్రబాబు బాహాటంగా పిలుపు నిచ్చిన నేపధ్యంలో ఏపి రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ చూసిన బిజెపి నేతలు గెలుపు తమదే అన్న ధీమాతో కొంత అత్యుత్సాహంతో మాట్లాడారు..

ఇక కర్ణాటక ఎన్నికలను పర్యవేక్షించిన రామ్ మాధవ్ కూడా చంద్రబాబు పిలుపును జనం తిప్పి కొట్టారన్నారు. టిడిపి ప్రచారం చేసిన కర్ణాటక హైదరాబాద్ బోర్డర్ ఏరియాల్లో గతంలో బిజెపికి 4 సీట్లుంటే ఈసారి 26 సీట్లు వచ్చాయని దీన్ని బట్టే చంద్రబాబు పిలుపుకు ఎంవగలాంటి స్పందన వచ్చిందో చూడొచ్చంటూ ట్వీట్ చేశారు.. కానీ మధ్యాహ్నానికల్లా ఫలితాలు తారుమారయ్యాయి. పూర్తి మెజారిటీ సాధిస్తుందనుకున్న బిజెపి104 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈనేపధ్యంలో అందరి దృష్టి ఏపిపై పడింది.. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపి పై దృష్టి పెడతాం అన్న బిజెపి ఏపికి ఏంచేస్తుంది. బిజెపి ఏకపక్షంగా గెలిచి ఉంటే ఏపిపై వరాల జల్లు కురిసి ఉండేదేమో.. హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పినా తన మాటకు సవరణలు చేసుకుని గెలుపు ఉత్సాహంలో ఏపి ప్రజల కోరిక తీర్చి ఉండేదేమో. కానీ ఇప్పుడు ఎటూ కాని పరిస్థితి ఏర్పడింది. దక్షిణాదిన గేట్ వేగా అనుకుంటున్న కర్ణాటకలో అధికారం ఆమడ దూరంలో ఊరిస్తోంది. స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బిజెపి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మరిలాంటప్పుడు ఏపికి బిజెపి ఏం చేస్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి ఏపిలో తమపార్టీ బలోపేతానికి ఏరకంగా కృషి చేస్తుంది? ఏపిలో బిజెపి కాలుపెట్టాలంటే... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై స్పందించాలి..దానిపై ఏదో ఒక వివరణ ఇవ్వాలి..ఏపికి జరిగిన మోసానికి తప్పంతా తనపై వేసుకునే పరిస్థితుల్లో బిజెపి లేదు.. మిత్ర పక్షంగా ఉన్న టిడిపి పొత్తు నుంచి బయటకు పోయిందన్న అక్కసు బిజెపికి ఉంది.. ఈ నేపధ్యంలో రాస్ట్రానికి నిధులివ్వకపోడానికి కారణం వివరించాల్సి ఉంటుంది.. దానికి కారణం చంద్రబాబు ప్రభుత్వం అవినీతేనంటూ మాట్లాడిన బిజెపి ఇప్పుడు దానికి ఆధారాలు చూపిస్తుందా? చంద్రబాబు ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా? కర్ణాటక ఎన్నికల తర్వాత తనపై చర్యలుంటాయంటూ చంద్రబాబు కూడా అనుమానం వ్యక్తం చేయడానికి కారణం ఇదేనా?మొత్తం మీద కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో ఏపి రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి.

ఇక తెలంగాణలోనూ బిజెపి రాజకీయ ఎదుగుదలకు పరిస్థితి అనుకూలంగా లేదు.గతంలో అమిత్ షా వచ్చి ఆర్భంటంగా తెలంగాణ అంతటా పర్యటించి వెళ్లారు.. తెలంగాణకు కేంద్రం లక్ష కోట్లు ఇచ్చిందంటూ ఏవేవో లెక్కలు చెప్పారు. అయితే మరుసటి రోజే కేసిఆర్ బిజెపి ఇచ్చిందేమీ లేదంటూ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు.. ఈనేపధ్యంలో తెలంగాణలో బిజెపి కాలు మోపడం అంత సులభం కాదని తేలిపోయింది. మరి తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఏం చేయబోతోంది?ప్రస్తుతం ఇదే ఆసక్తిని రేపుతున్న అంశం.

Show Full Article
Print Article
Next Story
More Stories