టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీ ప‌ర్య‌ట‌న‌లు..?

టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీ ప‌ర్య‌ట‌న‌లు..?
x
Highlights

సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ పార్టీ నేత‌లు గ‌ణాంకాలు సిద్ధం చేసుకుంటుంది. ఆ గ‌ణాంకాల ఆధారంగా టీడీపీ ఎలా వెన్నుపోటు పొడిచిందో కేడ‌ర్ కు...

సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ పార్టీ నేత‌లు గ‌ణాంకాలు సిద్ధం చేసుకుంటుంది. ఆ గ‌ణాంకాల ఆధారంగా టీడీపీ ఎలా వెన్నుపోటు పొడిచిందో కేడ‌ర్ కు చెప్పే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు టాక్. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు అమరావతి, రాజమండ్రి, విజయనగరాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ర్య‌ట‌నలో టీడీపీ మిత్ర ధ‌ర్మం, పార్టీపై కేడ‌ర్ కు ఉన్న అపోహ‌లు, టీడీపీ - బీజేపీ మిత్రబంధం వాజపేయి హయాంలో ఎలా వున్నది ? పీఎం మోడీ వచ్చాక ఎలా ఉంది ? టీడీపీ నాడు ఎలాంటి వెన్నుపోట్లు పొడించింది..? ఇప్పుడు ఎలా వెన్నుపోట్లు పొడుస్తుంద‌నే విష‌యాల్ని వివ‌రించే ప్ర‌యత్నం చేస్తున్నార‌ట సోము వీర్రాజు.
దావోస్ ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన చంద్ర‌బాబు బీజేపీ ని ఉద్దేశిస్తూ.. టీడీపీ వద్దనుకుంటే...నమస్కారం పెట్టాలని బీజేపీ అధిష్టానానికి సూచించారు. ఇప్పటికీ బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నామని చంద్రబాబు అన్నారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా మా నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని సీఎం అన్నారు. ఆ మాట‌లే త‌ప్ప బీజేపీ ని వ్య‌తిరేకించే చ‌ర్య‌ల‌కు టీడీపీ పాల్ప‌డ‌లేదు.
కానీ బీజేపీ మాత్రం అంత‌కు అంత టీడీపీని ఇరువైపులా టార్గెట్ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ వ‌స్తుంది. రాష్ట్రంలో అవినీతి పాల‌న‌, టీడీపీ త‌మ పార్టీకి అన్యాయం జ‌రుగుతుంద‌ని ఎలుగెత్తి చాటుతున్న చంద్ర‌బాబు శిబిరం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా ఉంది. అందుకు కార‌ణం రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర‌ప్ర‌భుత్వంపై ఆధార‌ప‌డి ఉంది కాబ‌ట్టి. నోరుజారే బ‌దులు డిఫెన్స్ రాజ‌కీయాలకు ప్రాధాన్య‌మిస్తే 2019 ఎన్నిక‌ల్లో స్వామికార్యం... స్వకార్యం ఇలా రెండింటిని తీర్చుకోవ‌చ్చ‌నే భావ‌న‌లో ఉన్నార‌ట ఏపీ టీడీపీ నేత‌లు.

అయితే అటు డిఫెన్స్ చేస్తున్న‌ట్లు చేస్తూ ఓ వైపు పార్ల‌మెంట్ కేంద్రంగా టీడీపీ రాజ‌కీయం చేస్తుంది. విభ‌జ‌న హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేలా బీజేపీపై ఒత్తిడి తెస్తున్న తెలుగు త‌మ్ముళ్ల తాజాగా ఢిల్లీ లో తోట నరసింహం సారధ్యంలో అఖిల పక్ష స‌మావేశం నిర్వహించింది. ఈ స‌మావేశంలో విభ‌జ‌న హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని టీడీపీ డిమాండ్ చేసింది. అయితే టీడీపీ డిమాండ్ పై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీకి చెక్ పెట్టే అస్త్రం ఇదేన‌ని అంటున్నారు నెటిజ‌న్లు. సుమారు నాలుగేళ్లు నిద్ర పోయి ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలకే ప్రాధ‌న్య‌త‌ను ఇస్తూ విభ‌జ‌న హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని ఎందుకు అడుగున్న‌ట్లు అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories