తెలంగాణ ఘోర పరాజయంపై బీజేపీ పోస్ట్‌మార్టం

x
Highlights

తెలంగాణలో ఘోర పరాజయానికి కారణాలు అన్వేషించింది బీజేపీ కోర్‌ కమిటి. బలంగా ఉన్న స్ధానాలతో పాటు అన్ని చోట్ల పోటీ చేయడం, టీఆర్ఎస్‌, బీజేపీలు కలిసి...

తెలంగాణలో ఘోర పరాజయానికి కారణాలు అన్వేషించింది బీజేపీ కోర్‌ కమిటి. బలంగా ఉన్న స్ధానాలతో పాటు అన్ని చోట్ల పోటీ చేయడం, టీఆర్ఎస్‌, బీజేపీలు కలిసి పోయాయంటూ జరిగిన ప్రచారమే ఘోర పరాజయానికి కారణంగా నేతలు గుర్తించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీనియర్ నేతలతో పాుట కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు పార్టీకి గట్టి ఎదురుదెబ్బని నేతలు అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్నికి గల కారణాలను తెలంగాణ బీజేపీ విశ్లేషించింది. కేంద్ర మంత్రి నడ్డా నేతృత్వంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పోటీ చేసిన అభ్యర్ధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీతో టీఆర్‌ఎస్‌కు సత్ససంబంధాలు ఉన్నాయని, ఈ రెండు పార్టీలు అంతర్గతంగా పొత్తులో ఉన్నాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో బీజేపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారు. పైగా ఎమ్మెల్యేలుగా కొనసాగిన సమయంలో ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హైదరాబాద్‌కు వచ్చి రావడంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి వెళ్లడం పార్టీలో కలవరం సృష్టించింది. ఈ విషయం కూడా కోర్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది.

పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం కారణంగా ఎక్కువ నష్టం జరిగిన విషయం కోర్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. వారి మధ్య అంతర్గత కలహాలు, ఆధిపత్యదోరణి నెలకొన్నందున నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగిందన్న వాదన విన్పిస్తోంది. జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొందరు నేతలు రాష్ట్ర కమిటీని నియంత్రించారన్న అభిప్రాయం కూడా వినవస్తోంది. బి ఫార్మ్స్ ఇచ్చారు తర్వాత అభ్యర్ధులను పట్టించుకోలేదని కొందరు నేతలు నడ్డాకు తెలియజేశారు. సమన్వయ లోపం కారణంగానే భారీ ఓటమి సంభవించిందని పలువురు నేతలు నడ్డాకు వివరించారు. బూత్ స్థాయిలో జరుగాల్సినంత పని జరగలేదని,పట్టణ ప్రాంతాల్లో ఓటర్ లిస్ట్ పై శ్రద్ద పెట్టలేదని వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు వెల్లడించారు. ఇప్పటికైనా మేలుకోకపోతే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని వారంతా అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories