ఫైనల్‌ మ్యాచ్‌లో పీవీ సింధూ ఓటమి..

ఫైనల్‌ మ్యాచ్‌లో పీవీ సింధూ ఓటమి..
x
Highlights

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధూ ఓటమి చెందింది. దీంతో ఈ స్టార్ ప్లేయర్ కు రజత పతకం దక్కింది....

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధూ ఓటమి చెందింది. దీంతో ఈ స్టార్ ప్లేయర్ కు రజత పతకం దక్కింది. స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ చేతిలో సింధు ఓటమి చెందింది. మొదట్లో పోరాటపటిమ చూపిన సింధు ఆ తరువాత నిరాశపరిచింది. మొదటి గేమ్‌ను 21-19 తేడాతో సొంతం చేసుకున్న మారిన్‌ రెండో గేమ్‌లో మరింత చెలరేగిపోయింది. మారిన్‌ దూకుడు ముందు సింధు నిలవలేక పోయింది. ఇక మైదానంలో చెలరేగిన మారిన్‌ రెండో గేమ్‌ను 21-10తేడాతో సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజేతగా స్పెయిన్‌ నిలిచింది. భారత క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకంతో సరిపెట్టుకుంది. కాగా సింధు చాంపియన్‌షిప్‌ లో రజత పతకం సాధించడంపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సింధును అభినందించారు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories