వైద్యురాలు అందుబాటులో లేక శిశువు మృతి

వైద్యురాలు అందుబాటులో లేక శిశువు మృతి
x
Highlights

వైద్యురాలు అందుబాటులో లేకపోవడం ఓ బాలింతకు శాపంగా మారింది. ఏఎన్‌ఎం డెలివరీ చేయడంతో వైద్యం వికటించి శిశువు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలోని ప్రభుత్వ...

వైద్యురాలు అందుబాటులో లేకపోవడం ఓ బాలింతకు శాపంగా మారింది. ఏఎన్‌ఎం డెలివరీ చేయడంతో వైద్యం వికటించి శిశువు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన రుద్రపు రమాదేవిని కాన్పు కోసం శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బంధువులు తీసుకు వచ్చారు. ఆ సమయానికి ఆసుపత్రిలో వైద్యురాలు అందుబాటులో లేనిసమయంలో ఏఎన్‌ఎం డెలివరీ చేయడంతో శిశువు మృతి చెందాడు. దీంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఏఎన్‌ఎం శోభారాణి మాత్రం ఫొన్ లో వైద్యురాలి సలహాతో నేను ఎన్నో డెలివరీ లు చేశానని,పేగు మెడకు చుట్టుకోవడంతోనే ఇలా జరిగిందని చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories