రసాభాసగా గ్రేటర్ కాంగ్రెస్ నాయకుల సమావేశం

x
Highlights

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. సికింద్రాబాద్ ఎంపీ స్థానం విషయంలో వివాదం తలెత్తింది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని...

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. సికింద్రాబాద్ ఎంపీ స్థానం విషయంలో వివాదం తలెత్తింది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని అజారుద్ధీన్ ప్రకటించడంతో వివాదం తలెత్తింది. దీంతో సమావేశంలో అంజన్‌కుమార్ యాదవ్ అనుచరులు అజారుద్ధీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంత సర్ధిచెప్పినా కార్యకర్తలు వినలేదు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తాను సికింద్రాబాద్‌ వీడేది లేదంటూ అంజన్ స్పష్టం చేశారు. దమ్ముంటే హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. అయితే అంజన్‌ మాట్లాడుతుండగానే సీనియర్ నేత వీహెచ్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ఈ సమావేశానికి ముఖేష్‌గౌడ్‌, విక్రమ్‌ గౌడ్‌ గైర్హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories