మరోసారి వార్తల్లోకి మహాభారతం...లక్ష్యగృహా ప్రాజెక్టులో కీలక ఆధారాలు లభ్యం

మరోసారి వార్తల్లోకి మహాభారతం...లక్ష్యగృహా ప్రాజెక్టులో కీలక ఆధారాలు లభ్యం
x
Highlights

మహభారతంలోని చారిత్రక ఘట్టాలకు సంబంధించిన ఆనవాళ్లు ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయా ? హస్తినపూర్‌, ఇంద్రప్రస్థ, కురుక్షేత్ర, మథురతో పాటు మరో గ్రామంలోనూ కీలక...

మహభారతంలోని చారిత్రక ఘట్టాలకు సంబంధించిన ఆనవాళ్లు ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయా ? హస్తినపూర్‌, ఇంద్రప్రస్థ, కురుక్షేత్ర, మథురతో పాటు మరో గ్రామంలోనూ కీలక ఆధారాలు లభ్యమయ్యాయా ? గత కొంతకాలంగా తవ్వకాలు జరుపుతున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా ఏం చెబుతోంది.

మహాభారతం...మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మహాభారతంలోని కీలక ఘట్టాలు, పాండవులు, కౌరవులకు సంబంధించిన ఆనవాళ్లు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు పురాతన శాస్త్రవేత్తలు గుర్తించారు. హస్తినపూర్‌, ఇంద్రప్రస్థ, కురుక్షేత్ర, మథుర, ద్వారకాలలో ఎన్నో కీలక విషయాలను సేకరించారు. తాజాగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బర్నావా గ్రామంలో ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మీరట్‌ సమీప గ్రామాల్లో లక్కగృహ ప్రాజెక్టులో భాగంగా తవ్వకాలు జరుపుతున్నారు.

తవ్వకాల్లో భాగంగా బర్నావాలో మహాభారతం కాలంలో పాండవులు, కౌరవులు ఉపయోగించిన వస్తులు లభించాయ్. మూడు నెలల పాటు జరిపిన తవ్వకాల్లో అప్పటి కాలంలో ఉపయోగించిన ప్లేట్లు, వంటకు ఉపయోగించిన వస్తువులు, పాత్రలు, కుండలు, లభ్యమైనట్లు ఆర్కియాలజిస్ట్‌లు తెలిపారు. హస్తినపూర్‌లో భారీ వరదలు రావడంతో అక్కడి ప్రజలంతా కౌశంబికి వలస వెళ్లినట్లు ఆర్కియాలజిస్ట్‌‌లు గుర్తించారు. హస్తినపూర్‌లో లభ్యమైన ఆధారాలు లక్కగృహలో దొరికిన ఆనవాళ్లు ఒకేలా ఉన్నాయని వారు చెప్పారు.

బాణాలు, యుద్ధంలో ఉపయోగించే వస్తువులు, పాండవులు, కౌరవులు ధరించిన మణిపూసలు బర్నావాలో లభ్యమయ్యాయ్. మహాభారతం కాలంలో భారీ వరదల కారణంగా మరోప్రాంతానికి రాజులు, ప్రజలు వలస వెళ్లడంతోని కొట్టుకుపోయి ఉంటాయని ఆర్కియాజిస్టులు అంచనా వేస్తున్నారు. క్రీస్తు పూర్వం 8వందల సంవత్సరం నాటి మనుషులు, పశువుల ఎముకలు, నాణేలు దొరికాయ్. వీటిని గతంలో లభించిన ఆధారాలతో పోల్చి చూసిన తర్వాత ఏ కాలం నాటివో అంచనాకు వస్తామని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మహాభారతంలో చెప్పిన లక్క గృహం ఆనవాళ్లు ఉన్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దీని ఆధారంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా తవ్వకాలు జరుపుతోంది. అసలు లక్కగృహం అంటే ఏమిటీ ? దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటీ ? అది ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉంది.

మహాభారతంలో లక్కగృహానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాభారాతాన్ని మలుపు తిప్పడంలో లక్కా గృహానిది కీలకపాత్ర. వనవాసం పూర్తయ్యాక తమకు రాజ్యంలో భాగం ఇవ్వకపోయినా కనీసం ఐదు ఊళ్లైనా ఇవ్వాలని పాండవులు కౌరవులను కోరుతారు. పాండవులు అడిగిన ఈ ఐదు ఊళ్లను వరుణవిరాట్ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. ఈ వరుణవిరాట్ ప్రాంతమే ప్రస్తుత బర్నావా అని చరిత్రకారుల చెబుతున్నారు. బర్నావ ప్రాంతంలోనే ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక ఆధారాలు సేకరరించింది.

పాండవులు ఐదు ఊర్లను అడిగారన్న కోపంతో కౌరవులు ఎలాగైనా అంతమొందించాలని పథకం రచిస్తారు. పాండవులను అంతం చేయాలన్న దురుద్దేశంతో కౌరవులు లక్కతో ఇంటిని నిర్మిస్తారు. ఇందులో ఉన్న పాండవులను సజీవంగా తగలబెట్టేందుకు కౌరవులు ప్రయత్నించడంతో పాండవులు సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయ్. ఈ సొరంగ మార్గంలో కౌరవుల నుంచి తప్పించుకునే క్రమంలో కొన్ని వస్తువులు వదిలేసి వెళ్లినట్లు తవ్వకాల్లో బయటపడింది.

గుజరాత్ సముద్రతీరంలో 1983వ దశకంలో జరిగిన ఈ పరిశోధనలో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయ్. గుజరాత్‌ పశ్చిమాన గోమతి నది వెళ్లి అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్రగర్భంలో ద్వారక బయటపడింది. దీంతో గుజరాత్‌లోనూ కృష్ణుడు, పాండవులు, కౌరవులు ఆనవాళ్లు గుర్తించారు. తాజాగా బర్నావలో జరుగుతున్న తవ్వకాల్లో మహాభారతం కాలం నాటి పాత్రలు, కిరీటాలు, నాణేలు లభ్యమయ్యాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories