ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఫలితాలను ప్రకటించారు. మొత్తం 73.33 శాతం ఉత్తీర్ణత...

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఫలితాలను ప్రకటించారు. మొత్తం 73.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. 84శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలవగా 54శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా లాస్ట్‌ ప్లేస్‌‌లో నిలిచింది. 77శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో 76శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.

‎ఏపీ ఇంటర్ సెకండియర్‌ ఫలితాల్లో 67శాతం ఉత్తీర్ణత సాధించి బాలురపై బాలికలు పైచేయి సాధించారు. ఇక ఎంపీసీలో 992 మార్కులతో తేజవర్ధన్‌రెడ్డి ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా, 991 మార్కులతో షేక్ ఆఫ్రాన్‌ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. 990 మార్కులతో సుష్మా మూడో ర్యాంక్‌ సాధించింది. ఇక బైపీసీలో మొదటి ముగ్గురు ర్యాంకర్లకు 990 మార్కులే వచ్చినా దీక్షిత‌కు ఫస్ట్‌ ప్లేస్‌, లక్ష్మీకీర్తికి సెకండ్‌ ప్లేస్‌, షిన్యతకు థర్డ్‌ ప్లేస్‌ దక్కాయి.

ముందే చెప్పినట్లుగా ఈసారి రికార్డు సమయంలోనే ఫలితాలను విడుదల చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలు ముగిసిన 24రోజుల్లోనే రిజల్ట్స్‌ ప్రకటించామన్నారు. మే 14నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్న గంటా ఈనెల 21లోపు ఫీజు చెల్లించాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories