ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అడిగిన నేత‌..స‌స్పెండ్ చేసిన ఏపీ బీజేపీ

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అడిగిన నేత‌..స‌స్పెండ్ చేసిన ఏపీ బీజేపీ
x
Highlights

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ వైసీపీ - టీడీపీ ఎంపీలు ఎన్డీఏ ప్ర‌భుత్వం పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. ఓ వైపు టీడీపీ త‌న‌కు అనుకూలంగా ఉన్న...

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ వైసీపీ - టీడీపీ ఎంపీలు ఎన్డీఏ ప్ర‌భుత్వం పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. ఓ వైపు టీడీపీ త‌న‌కు అనుకూలంగా ఉన్న ఇత‌ర పార్టీల అధినేత‌ల‌తో మంతనాలు జ‌రుపుతోంది. మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకుంటోంది. వైసీపీ కూడా త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న పార్టీల‌తో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ప‌నిలో ప‌నిగా కేంద్రంలో ఎన్డీఏ పెద్ద‌ల‌తో భేటీ నిర్వ‌హిస్తుంది. ఈ భేటీలో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాల‌ని కోరుతుంది.ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తే రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుంది. పార్టీ ఏ విధంగా బ‌ల‌ప‌డుతుంది అనే అంశంపై ఓ నివేదిక‌ను త‌యారు చేసింది. ఆ నివేదిక‌ను బీజేపీ జాతీయ నేత‌ల‌కు, ఏపీ టీడీపీ నేత‌ల‌తో అందించింది.
ఓ వైపు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారున్నా..ఎన్డీఏపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. లోక్ స‌భ‌లో బిల్లు స‌రైన ఆర్డర్ లో లేనందున వ‌రుస‌గా నాలుగు సార్లు వాయిసింది.
ఇదిలా ఉంటే ఏపీలో ప్ర‌త్యేక హోదా హాట్ టాపిక్ అవుతోంది. హ‌స్తిన‌లో అవిశ్వాసం వ‌ర‌కూ వెళ్లింది. అంతేగాకుండా ఆఖరికి బీజేపీలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌మ‌ల‌ద‌ళంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే కొంద‌రు కీల‌క నేత‌లు బీజేపీ నుంచి జారిపోయారు. హోదా విష‌యంలో బీజేపీకి రాంరాం చెప్పిన కొంద‌రు నేత‌లు జ‌న‌సేన నేత‌లుగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు.
ఇక తాజాగా విశాఖ‌లో ఓ యువ‌నేత మీద బీజేపీ వేటు వేసింది. దానికి కార‌ణం ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దించ‌డ‌మే. గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో తెర‌మీద‌కు వ‌చ్చిన విశాఖ వాసి అడారి కిషోర్ కుమార్ ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. కానీ తాజాగా ఆయ‌న బ‌హిరంగంగా పార్టీ తీరుని విమ‌ర్శించార‌నే పేరుతో ఆయ‌నపై బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు హ‌రిబాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చోటే పార్టీలో భిన్నాభిప్రాయాలు రావ‌డంతో వెంట‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

బీజేపీ నిర్ణ‌యంపై అడారి కిషోర్ సీరియ‌స్ అయ్యారు. బీజేపీ మోసం చేసింద‌ని వాపోయారు. త‌న‌తో పాటు అనేక‌మంది పార్టీ మీద న‌మ్మ‌కంతో చేరితే, చివ‌ర‌కు హోదా హామీని తుంగ‌లో తొక్కి ఇప్పుడు అడిగినందుకు వేటు వేయ‌డం అన్యాయ‌మంటున్నారు. తాను మాత్రం పార్టీలు, జెండాల‌కు అతీతంగా హోదా కోసం సాగుతున్న ఉద్య‌మానికి అండగా ఉంటాన‌ని తెలిపారు. మొత్తంగా హోదా బీజేపీని కుదేలు చేస్తుంద‌న్న మాట‌.

Show Full Article
Print Article
Next Story
More Stories