చంద్రబాబుపై బీజేపీ ఎదురుదాడి

చంద్రబాబుపై బీజేపీ ఎదురుదాడి
x
Highlights

ఢిల్లీలోని అమిత్‌షా నివాసంలో ఏపీ బీజేపీ నేతలతో కీలక భేటీ జరిగింది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం, కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబు జాతీయ...

ఢిల్లీలోని అమిత్‌షా నివాసంలో ఏపీ బీజేపీ నేతలతో కీలక భేటీ జరిగింది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం, కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబు జాతీయ స్థాయిలో పావులు కదుపుతుండటంపై ఈ భేటీలో చర్చించారు. అలాగే, టీడీపీతో తెగదెంపుల తర్వాత ఏపీలో బీజేపీ ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిన సాయాన్ని ప్రజలకు వివరిస్తూ.. టీడీపీ వైఖరి ఎండగట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

చంద్రబాబుపై దాడిని బీజేపీ మరింత ఉధృతం చేసింది. ఏపీ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించిన అమిత్‌షా... పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అమిత్‌షా... భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాని మండిపడినట్టు తెలుస్తోంది. హోదాకు సమానంగా ఏపీకి కేంద్రప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చిందని... ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్న టీడీపీ, వైసీపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.... బీజేపీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories