కోహ్లీని భ‌య‌పెట్టిన అనుష్క‌

కోహ్లీని భ‌య‌పెట్టిన అనుష్క‌
x
Highlights

హారర్ సినిమా అంటే ఇలా ఉంటుందనే సినిమాటిక్ ప్రిన్స్‌పుల్స్‌ని బ్రేక్ చేస్తోంది అనుష్క. 'పారీ'. టీజర్స్‌తోనే ఈ సినిమా హాలీవుడ్ స్టైల్లో...

హారర్ సినిమా అంటే ఇలా ఉంటుందనే సినిమాటిక్ ప్రిన్స్‌పుల్స్‌ని బ్రేక్ చేస్తోంది అనుష్క. 'పారీ'. టీజర్స్‌తోనే ఈ సినిమా హాలీవుడ్ స్టైల్లో భయాన్నిపీక్స్‌లో చూపించింది. అయితే పారీ ఇవ్వాళ విడుద‌ల కానున్న సంద‌ర్భంగా ఆ సినిమా చూసిన ఆమె భ‌ర్త విరాట్ కోహ్లీ తెగ‌భ‌య‌ప‌డిపోయాడు. ఇదే విష‌యాన్ని నెటిజ‌న్ల‌తో షేర్ చేశారు.
సాధారణంగా దెయ్యం కథలు అనగానే కనిపించే చీకటి, అరుపులు, విచిత్ర శబ్దాలు లేకుండా, బిల్డప్ తక్కువ బిజినెస్ ఎక్కువ అనే స్టైల్లో భయపెడుతున్నాయి 'పారీ' టీజర్స్. ప్రాశిత్ రాయ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న 'పారీ' సినిమాను నిర్మిస్తూ, లీడ్ రోల్ పోషిస్తోంది అనుష్క శర్మ, బయటి బ్యానర్స్‌లో రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌తో నటిస్తూ, వైవిధ్యమైన కథలను తానే నిర్మిస్తోన్న అనుష్క, 'పారీ'లో ఓ వింత జబ్బు ఉన్న అమ్మాయిలా కనిపించబోతోంది.
స్క్రీమర్-1లోనే గాయాలు, వాటినుంచి రక్తం వచ్చే విజువల్స్ ఒళ్ళు జలదరించేలా ఉంటే, రీసెంట్‌గా వచ్చిన స్క్రీమర్-2 అంతకుమించి అన్నట్లుగా ఉంది. గొలుసులతో బంధించి ఉన్న షాట్‌తో సానుభూతి, ఆ వెంటనే కత్తుల్లా మారే గోళ్ళ విజువల్స్‌తో భయం కలుగుతున్నాయి. ఇలాంటి ఎమోషన్స్ 'పారీ' సినిమాలో టన్నుల కొద్దీ ఉన్నాయట.
అయితే ఈ సినిమాను చూసిన విరాట్ కోహ్లి పెళ్లి తనదైన ైస్టెల్ రీవ్యూ కూడా రాశాడు. సౌతాఫ్రికా సిరీస్ తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త రిలాక్సవుతున్న విరాట్.. గురువారం రాత్రి పరీ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ చూశాడు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో అనుష్క స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ చూసి కోహ్లి తెగ ఖుష్ అయ్యాడు. ఓ ట్వీట్‌లో సింపుల్‌గా తన రీవ్యూ చెప్పేశాడు. పరీ సినిమా చూశాను. నా భార్య బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ. చాలా భయపడ్డాను.. కానీ అనుష్కను చూసి గర్వంగా ఉందంటూ.. భార్యపై తెగ ప్రశంసలు కురిపించాడు.
దీనికి అనుష్క కూడా రియాక్టయింది. కామెంట్స్‌లో ఆమె ఓ స్మైలీని పోస్ట్ చేసింది. కోహ్లి చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. నిమిషాల్లోనే వెయ్యికిపైగా రీట్వీట్స్ చేశారు. అనుష్క శర్మ తల్లిదండ్రులతో కలిసి విరాట్ ఈ మూవీ చూశాడు. సినిమా రిలీజ్‌కు ముందు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఉందని విరాట్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. చాలామంది అనుష్క పర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories