ఏపీకి ప్రత్యేక హోదా కోరుతు మరో ఆత్మ బలిదానం

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతు మరో ఆత్మ బలిదానం
x
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతు మరో ఆత్మ బలిదానం జరిగింది. విశాఖలో త్రినాథ్ అనే యువకుడు రాష్ట్రానికి హోదా ఆంకాక్షతో ప్రాణాలు అర్పించాడు. నక్కపల్లి మండలం...

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతు మరో ఆత్మ బలిదానం జరిగింది. విశాఖలో త్రినాథ్ అనే యువకుడు రాష్ట్రానికి హోదా ఆంకాక్షతో ప్రాణాలు అర్పించాడు. నక్కపల్లి మండలం వేంపాడు కాగిత టోల్ గేటు వద్ద సెల్ టవర్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుంటునట్టు సూసైడ్ లెటర్‌ లో పేర్కొన్నాడు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తు..హోదా అవసరాన్ని అందులో పేర్కొన్నాడు. రాజమండ్రి సమీపంలోని లాలా చెరువు బర్మాకాలనీకి చెందిన దొడ్డి త్రినాథ్‌ (28) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో ఆరేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు. దీనికి కారణం ప్రత్యేక హోదా రాకపోవడమే అని నమ్మేవాడు.ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని సెల్ టవర్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా త్రినాథ్‌ తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి నూకరత్నం, అన్న వీర వెంకట సత్యనారాయణతో కలిసి రాజమండ్రిలో ఉండేవాడు. అన్న రాజమండ్రిలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అక్క ఉమాదేవిని నక్కపల్లి మండల పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగరావుకు ఇచ్చి వివాహం చేయడంతో వారి కుటుంబం నామవరం వద్ద ఉంటోంది. అక్కా బావల వద్దకు ఏడాది క్రితం వచ్చిన త్రినాథ్‌ ఇక్కడే ఉంటున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories