బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు..
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుడం బలపడడంతో.. ఉత్తర కోస్తాకు తుఫాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి...

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుడం బలపడడంతో.. ఉత్తర కోస్తాకు తుఫాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 690 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు 720 కిలోమీటర్లు దూరంలో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని, 48 గంటల్లో తీవ్రవాయుగుండం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, అన్ని ప్రధాన పోర్టుల్లో విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. మత్స్యకారులను వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories