సీఎం చంద్రబాబు అమెరికా షెడ్యూల్ ఇదే..

సీఎం చంద్రబాబు అమెరికా షెడ్యూల్ ఇదే..
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే ద్యేయంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. పెట్టుబడులు, వివిధ కార్యక్రమాలకోసం సీఎం చంద్రబాబునాయుడు అమెరికా...

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే ద్యేయంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. పెట్టుబడులు, వివిధ కార్యక్రమాలకోసం సీఎం చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈనెల 27 వరకు ఐదు రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్న చంద్రబాబు.. తొలిరోజు.. ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత రాజయభారి సయ్యద్ అక్బరుద్దీన్‌తో ఇవాళ భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం హెచ్‌పీఈ బిజినెస్ యూనిట్ వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో చంద్రబాబు సమావేశమై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి చర్చిస్తారు. ఆ తరువాత నెవార్క్‌ నగరంలోని న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వెల్‌నెస్‌ కేంద్రంలో జరిగే సెనేట్‌కు హాజరవుతారు. అనంతరం ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో సమావేశం అవుతారు.

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టవలసిందిగా వారిని ఉద్దేశించి మాట్లాడతారు. ఇక రెండో రోజు ముఖ్యమంత్రి పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్, రాక్ వెల్లర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ శాలతో వేర్వేరుగా భేటీ అవుతారు. మూడోరోజున ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే.. సదస్సులో మాట్లాడనున్న చంద్రబాబు.. సుస్థిర సేద్యానికి ఆర్ధిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే నాల్గవ రోజున భారత టెలికం దిగ్గజం సునీల్ భారతీ మిట్టల్‌లో తో చంద్రబాబు సమావేశం అవుతారు. ముగిసిన అనంతరం కొలంబియా విశ్వ విద్యాలయాన్ని సందర్శిస్తారు. పర్యటన చివరి రోజైన ఐదో రోజు భారత వాణిజ్య మండలి సిఐఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం భారత్ కు తిరుగుపయనమవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories