భారీ వ్యూహంతో ఢిల్లీకి చంద్రబాబు

భారీ వ్యూహంతో ఢిల్లీకి చంద్రబాబు
x
Highlights

నీతి ఆయోగ్ 4వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం రేపు న్యూ ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల...

నీతి ఆయోగ్ 4వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం రేపు న్యూ ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు పాల్గోనున్నారు. ఈ సమావేశంలో న్యూ ఇండియా 2022 డెవలప్‌మెంట్ ఎజెండాకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఇప్పటికే మూడు సమావేశాలను పూర్తి చేసుకున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 4వ సమావేశానికి సమాయత్తం అవుతోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే అంశంలో ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంతో పాటు ఆయుష్మాన్ భారత్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్, మిషన్ ఇంద్రధనుస్సు, ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి అంశం, మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలు తదితర అంశాలపై ప్రధానం చర్చ జరగనుంది.

నీతి ఆయోగ్ ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం మూడు సార్లు జరిగింది. గవర్నింగ్ కౌన్సిల్ మొదటి సారిగ 2015 ఫిబ్రవరి 8న సమావేశం అయింది. అదే ఏడాది జూలైలో మరోసారి సమావేశమయింది. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల విరామం తర్వాత 2017 ఏప్రిల్ 23న భేటీ అయింది. జమిలి ఎన్నికల నిర్వహణ, ఆర్దిక సంవత్సరం మార్పు వంటి విషయాలను కీలకంగా చర్చించారు. నాల్గవ సమావేశంలో 6 కీలక అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు.

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 4వ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన వాదనను బలంగా వినిపించేందుకు సమాయత్తం అయ్యారు. అధికారులతో 24 పేజీల నివేదికను తయారు చేయించారు. సమావేశంలో తన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వకపోతే అక్కడే తన నిరసన తెలిపేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories