ఆనంద్ మ‌హీంద్రాకు షాకిచ్చిన బాల‌య్య‌

ఆనంద్ మ‌హీంద్రాకు షాకిచ్చిన బాల‌య్య‌
x
Highlights

సంక్రాంతి బ‌రిలో దిగిన జైసింహా బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను సృష్టింస్తుంది. ఈ సినిమాలో హీరో బాల‌కృష్ణ ఉన్న స‌న్నివేశంలో ఓ చిన్నబాలుడు త‌న పాల డ‌బ్బాను...

సంక్రాంతి బ‌రిలో దిగిన జైసింహా బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను సృష్టింస్తుంది. ఈ సినిమాలో హీరో బాల‌కృష్ణ ఉన్న స‌న్నివేశంలో ఓ చిన్నబాలుడు త‌న పాల డ‌బ్బాను పోగొట్టుకుంటాడు. అయితే ఆ పాల‌డ‌బ్బా బొలేరో వాహనం కింద ఉన్న‌ విష‌యాన్ని బాల‌య్య గుర్తిస్తాడు. వెంట‌నే బొలేరో వాహ‌నాన్ని త‌న ఒంటిచేస్తో పైకెత్తి పాల డ‌బ్బ‌తీసి అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడు. అయితే ఇప్పుడా సీన్ చూసిన ప్ర‌తీఒక్క‌రు విజిల్స్ వేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అలా చైత‌న్య అనే ఓ నెటిజ‌న్ బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే స‌న్నివేశాన్ని బిజినెస్ మ్యాన్ ఆనంద్ మ‌హీంద్రాకు ట్వీటర్ లో పంపిచాడు. ‘మహీంద్ర సర్‌..బాలకృష్ణ బొలెరో కారు ఎత్తుతున్న సన్నివేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఈ సీన్‌ చూడాలి సర్‌’ అని ట్వీట్‌ చేశారు. నెటిజ‌న్ కోరిక‌మేర‌కు ఆ సీన్ చూసిన మ‌హీంద్ర షాక్ తిన్నారు. ‘హాహా..బొలెరో కార్లను చెక్‌ చేయడానికి సర్వీస్‌ వర్క్‌షాపులు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లు వాడనక్కర్లేదు’ అని సరదాగా ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories